11 year old Akhil meets Minister Lokesh

Lokesh: మంత్రి లోకేష్‌ను కలిసి 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్

Lokesh: ఏపీ కి చెందిన 11 ఏళ్ల టెక్ పిడుగు అఖిల్ ఆకెళ్ల టెక్నాలజీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు(శుక్రవారం) విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌ను అఖిల్ ఆకెళ్ల కలుసుకున్నారు. ఉండవల్లిలోని నివాసంలో తన తండ్రితో కలిసి మంత్రి నారా లోకేష్‌తో సమావేశమయ్యారు. యూకేలో విద్యను అభ్యసిస్తున్న 11 ఏళ్ల అఖిల్.. చిన్న వయసులోనే టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు.

Advertisements

టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్‌

ఈ రంగంలో ఎన్నో మైలురాళ్లను సాధించాడు. మైక్రోసాఫ్ట్ ధృవీకరించిన అజ్యూర్, డేటా, సెక్యూరిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫౌండేషన్ కోర్సుల్లో సర్టిఫికేషన్లు పొందాడు. యూకేలో నిర్వహించిన పలు టెక్ సమ్మిట్‌లలో పాల్గొన్నాడు. అమరావతిలో జరగనున్న సమాచార, సాంకేతిక అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అఖిల్ ఆసక్తి చూపించడంతో త్వరలోనే కలుస్తానని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం అఖిల్‌ను కలుసుకున్నారు. టెక్నాలజీలో అద్భుత ప్రతిభను కనబరుస్తున్న అఖిల్‌ను ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. ముందు ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని మంత్రి అన్నారు.

కోడింగ్ నైపుణ్యాలతో ఆరు మైక్రోసాఫ్ట్ ఐటీ సర్టిఫికేట్లు

కాగా, కరోనా మహమ్మారితో ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతున్న సమయంలో అఖిల్ ఆకెళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో కోడింగ్ నైపుణ్యాలతో ఆరు మైక్రోసాఫ్ట్ ఐటీ సర్టిఫికేట్లు సాధించుకున్నాడు. ఇండస్ట్రీ అవసరాలకు తగినట్లుగా ఏఐ సొల్యూషన్స్ అందిస్తూ ఉంటారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆసక్తి ఎక్కువ ఉన్న అఖిల్ ఆకెళ్ల.. 2025లో జరిగే టెక్ షోలో పాల్గొనాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరోవైపు కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో పిల్లల కోసం స్క్రాచ్ పేరుతో ఉచిత కోడింగ్ ప్లాట్‌ఫామ్ రూపొందించారు. సొంతంగా ఆన్‌లైన్ గేమ్స్ తయారు చేసుకోవడంతో పాటుగా యానిమేషన్‌ల ద్వారా పాత్రలకు ప్రాణం పోస్తుంటాడు.

Related Posts
టీ స్టాల్ నిర్వాహకుడికి కేటీఆర్ భరోసా
ktr sirisilla

సిరిసిల్ల టౌన్‌లో ఓ సాధారణ టీ స్టాల్ నిర్వాహకుడికి అన్యాయం జరిగిందని భావించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతనికి భరోసా ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల క్యాంప్ Read more

Narendra Modi: అమరావతి రైతులను సన్మానించనున్న మోదీ
Narendra Modi: అమరావతి రైతులను సన్మానించనున్న మోదీ

అమరావతి రాజధాని నిర్మాణానికి తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించింది. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి విచ్చేసి రాజధాని పనుల Read more

Bandi Sanjay : డిజిటల్ అరెస్టుల పై బండి సంజయ్ కామెంట్స్
377245 bandi sanjay

సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది. డిజిటల్ అరెస్టుల పేరుతో ఆర్థిక మోసాలకు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించి, వారి అక్రమ కార్యకలాపాలను నిలువరించేందుకు Read more

కేఎల్‌హెచ్‌ బాచుపల్లిలో ఏఐ అభివృద్ధి
KLH Bachupally is developing sustainability in AI

ఢిల్లీ : నేటి శక్తివంతమైన ప్రొఫెషనల్ ప్రపంచంలో రాణించడానికి అవసరమైన కీలకమైన నైపుణ్యాలు మరియు జ్ఞానంతో విద్యార్థులను సన్నద్ధం చేయడం లక్ష్యంగా KLH బాచుపల్లి క్యాంపస్ ఇటీవల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×