100th mission launch in January.. ISRO chief

జనవరిలో 100వ మిషన్‌ ప్రయోగం: ఇస్రో చీఫ్‌

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 2025లో జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎన్‌వీఎస్-02 ప్రయోగం చేపట్టనున్నది. ఈ మిషన్‌ కోసం సన్నాహాలు చేస్తుంది. వచ్చే ఏడాది ప్లాన్‌ చేసిన పలు మిషన్‌లో జీఎస్‌ఎల్‌వీ మిషన్‌ ఒకటని ఇస్రో చైర్మన్‌ సోమ్‌నాథ్‌ తెలిపారు. ఇస్రో సోమవారం రాత్రి విజయవంతంగా స్పాడెక్స్‌ మిషన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సోమ్‌నాథ్‌ ఈ ప్రకటన చేశారు.

Advertisements

మే 29, 2023న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 రాకెట్ ఎన్‌ఎస్‌వీ-01 ఉపగ్రహాన్ని జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (GTO)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని సోమ్‌నాథ్‌ పేర్కొన్నారు. ఎన్‌వీఎస్‌-04 ఉపగ్రహంలో స్వదేశీ అటామిక్‌ క్లాక్‌ ఉంటుందన్నారు. ఇది ఇండియన్‌ కాన్స్టెలేషన్‌ (NAVIC)తో నావిగేషన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. కవరేజ్‌ కోసం ఎల్‌1 బ్యాండ్‌ సిగ్నల్‌ కలిగి ఉంటుందన్నారు. ఎన్‌వీఎస్‌-2 మిషన్‌తో మరింత పురోగతి సాధించాలని భావిస్తున్నామన్నారు. అధునాతన ఫీచర్స్‌తో నావిక్‌ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు.

ఇస్రో చీఫ్‌ ఈ సందర్భంగా చంద్రయాన్‌-4 మిషన్‌పై కీలక సమాచారాన్ని వెల్లడించారు. మిషన్‌లో వివిధ మాడ్యూల్స్‌ ఉంటాయని.. వేర్వేరు సమయాల్లో ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు వేర్వేరు మాడ్యూల్స్‌లో ఒకేసారి కలుపనున్నట్లు తెలిపారు. ఈ మాడ్యూల్స్‌ కక్షలోకి చేరుకోవాల్సి ఉంటుందని.. ఆ తర్వాత భూమి కక్ష్య, చంద్రుడి కక్ష్యలో రెండింటిలోనూ డాక్‌ చేయాల్సి ఉంటుందన్నారు. చంద్రుడిపై దిగి విజయవంతంగా తిరిగి రావడమే చంద్రయాన్-4 లక్ష్యమని సోమ్‌నాథ్‌ స్పష్టం చేశారు.

Related Posts
రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ పర్యటన..
modi putin

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు రానున్నారు. ఈ పర్యటన గురించి క్రెమ్లిన్ ప్రెస్ కార్యదర్శి డిమిత్రి పెస్కోవ్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, పుతిన్ పర్యటనకు Read more

Sanna Biyyam Distribution In Telangana : పేదలూ సన్న బియ్యం తినాలనేది మా ఆకాంక్ష – సీఎం
ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ‘ఉగాది కానుక’

తెలంగాణను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చే విధంగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. రవీంద్రభారతిలో Read more

Aghori : అఘోరికి 14 రోజుల రిమాండ్
Aghori : అఘోరికి 14 రోజుల రిమాండ్

Aghori : అఘోరికి 14 రోజులు రిమాండ్: కంది జైలుకు తరలింపు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలానికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు ఆధారంగా అఘోరి అలియాస్ Read more

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
sangareddy bike accident

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా గణేశ్ పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఓ బైక్ ను ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి Read more

×