Sunny Leone

సన్నీ లియోన్ పేరుతో ప్రభుత్వ లబ్ది

ప్రముఖ నటి సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నెలనెలా రూ.వెయ్యి అందిస్తోంది. వివాహిత మహిళల కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంలో సన్నీ లియోన్ ను అక్కడి అధికారులు లబ్దిదారుగా ఎంపిక చేశారు. నెలనెలా ఆమె ఖాతాలో రూ. వెయ్యి జమ చేస్తున్నారు. రికార్డులలో సన్నీ లియోన్ పేరు, ఫొటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

Advertisements

సన్నీ లియోన్ కు ఛత్తీస్ గఢ్ కు సంబంధం ఏంటి.. ప్రభుత్వం ఇచ్చే వెయ్యి రూపాయల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఆమెకు ఏంటనే సందేహిస్తున్నారా..? అక్కడి అధికారులకు మాత్రం ఎలాంటి సందేహం రాలేదు.
మోసానికి పాల్పడ్డ వీరేంద్ర జోషి
దరఖాస్తులను చూశారో లేదో, లేక తమకు ముట్టాల్సింది ముట్టగానే చకచకా సంతకాలు పెట్టేశారో కానీ సన్నీ లియోన్ పేరు మాత్రం లబ్దిదారుల జాబితాలో చేరింది. నెలనెలా ప్రభుత్వం ఆ ఖాతాలో డబ్బులు కూడా జమచేస్తోంది. బస్తర్ రీజియన్ లోని తాలూర్ గ్రామంలో ఈ మోసం బయటపడింది. దీనిపై కలెక్టర్ విచారణకు ఆదేశించగా.. గ్రామానికి చెందిన వీరేంద్ర జోషి ఈ మోసానికి పాల్పడ్డట్లు తేలింది.

ఛత్తీస్ గఢ్ లోని బీజేపీ సర్కారు వివాహిత మహిళల కోసం ‘మహతారి వందన యోజన’ పథకం తీసుకొచ్చింది. ఈ పథకం కింద వివాహిత స్త్రీలకు నెలకు రూ. వెయ్యి చొప్పున అందజేస్తోంది. ఈ మొత్తాన్ని నేరుగా వారి వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఈ పథకానికి అవినీతి మరక అంటుకుందని ప్రతిపక్షాలు ఆరోపించినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
నకిలీ ఖాతా
ఈ క్రమంలోనే ఓ యువకుడు సన్నీ లియోన్ పేరు, ఫొటో లతో బ్యాంకు ఖాతా తెరిచి ఈ పథకానికి దరఖాస్తు చేయగా.. అధికారులు కనీస పరిశీలన కూడా చేయకుండానే ఆమోదం తెలిపారు. కాగా, ఈ పథకంపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తోంది. మహతారి వందన యోజన లబ్దిదారుల్లో దాదాపు సగం మంది ఫేక్ అని ఆరోపిస్తోంది.

Related Posts
రాజమౌళి-మహేష్ సినిమాకు ప్రియాంక చోప్రా?
రాజమౌళి-మహేష్ సినిమాకు ప్రియాంక చోప్రా?

మహేష్ బాబు హీరోగా దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి రూపొందిస్తున్న జంగిల్ అడ్వెంచర్ చిత్రం గురించి తాజా పుకార్లు పుట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అధికారిక సమాచారం ఇంకా విడుదల Read more

వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం
వక్ఫ్ బిల్లుకు జేపీసీ సిఫార్సుల ఆమోదం

ముస్లింలకు సంబంధించిన వక్ఫ్ ఆస్తుల చట్టబద్ధతను దేశవ్యాప్తంగా నిర్ధారించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో Read more

బిచ్చం అడిగినందుకు అరెస్ట్..ఆ వివరాలు ఏంటి?
beggers

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అక్కడి పోలీసులు.. బిచ్చం అడుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. భోపాల్‌లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర Read more

Mamata Banerjee : మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం
Mamata Banerjee మమతా బెనర్జీపై యోగి ఆదిత్యనాథ్ తీవ్ర ఆగ్రహం

పశ్చిమ బెంగాల్‌లో అల్లర్ల మంటలు ఊపందుకుంటున్నా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిశ్శబ్దంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో లౌకికవాదం Read more

Advertisements
×