చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

విస్తరింపజేసుకుంటున్న అదానీ వ్యాపారం

దేశీయ పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీకి చెందిన గ్రూప్ సంస్థలు.. విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకున్నాయి. తమ వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పెట్రోకెమికల్స్ రంగంలోకి అడుగు పెట్టాయి. ఇందులో భాగంగా థాయ్‌లాండ్‌కు చెందిన ఇండోరమ రిసోర్సెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.
అదాని గ్రూప్‌కు చెందిన అదానీ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ ఈ మేరకు ఇండోరమ రిసోర్సెస్‌తో జాయింట్ వెంచర్‌గా ఆవిర్భవించింది. ఇండోరమ రిసోర్సెస్ జాయింట్ వెంచర్ కంపెనీ వాలర్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌తో విలీన ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ వెల్లడించింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్‌ సమాచారాన్ని ఇచ్చింది.

Advertisements

ఈ జాయింట్ వెంచర్‌లో అదానీ పెట్రోకెమికల్స్- ఇండోరమ మొత్తం 50 శాతం వాటాలను కలిగి ఉంటాయి. రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్ రంగంలో అడుగుపెట్టాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. దీర్ఘకాలంలో రిఫైనరీలు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లు, స్పెషాలిటీ కెమికల్ యూనిట్లు, హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. గుజరాత్‌లో కొత్త పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌లో నాలుగు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గౌతమ్ అదానీ 2022లోనే వెల్లడించిన విషయం తెలిసిందే.

Related Posts
కేజ్రీవాల్‌ కేసు..ఈడీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
11 1

న్యూఢిల్లీ: ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులిచ్చింది. ఎక్సైజ్‌ పాలసీ కేసుతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్‌ కేసులో తనపై Read more

ఆస్తుల వివరాలు వెల్లడించిన కేజ్రీవాల్‌
Kejriwal revealed details of assets

న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తుల వివరాలను తాజా ఆఫిడవిట్ Read more

ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు సజీవదహనం
Fatal road accident..Five people were burnt alive

ప్రమాద తీవ్రతకు మంటలు చెలరేగి బూడిదైన వాహనం చెన్నై: బుధవారం తెల్లవారుజామున తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరూర్‌ జిల్లా కుళితలై హైవేపై బస్సు, కారు Read more

Pahalgam Terrorist Attack : భారత్, పాక్ మధ్యవర్తిత్వానికి సిద్ధం – ఇరాన్
1200 675 24027661 thumbnail 16x9 pahalgam terror attack

జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన తీవ్రవాద దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇరాన్ కీలక ప్రకటన Read more

Advertisements
×