gachibowli flyover closed

వారం పాటు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత..ఎందుకంటే..!!

హైదరాబాద్‌లోని వాహనదారులకు హెచ్చరిక. ట్రాఫిక్ అధికారులు గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ను వారం రోజుల పాటు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్‌ ఫేజ్‌-2 ప్రాంతంలో ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతోంది. ఈ కారణంగా ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు.

సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. ఈ ఆంక్షలు అక్టోబర్ 28 వరకు అమలులో ఉంటాయన్నారు. గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ మూసివేత కారణంగా, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు. బయోడైవర్సిటీ జంక్షన్‌ నుంచి ఐఐఐటీ జంక్షన్‌ వైపు ప్రయాణించే వాహనాలు బిచ్చారెడ్డి స్వీట్స్‌ ద్వారా మళ్లిస్తారు. అలాగే, ఐఐఐటీ జంక్షన్‌ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌కు వెళ్లే వాహనాలు కూడా గచ్చిబౌలి జంక్షన్‌ పక్కనుండి వెళ్తాయి. వాహనదారులు తమ ప్రయాణాలకు ముందుగా ఈ మార్పులను దృష్టిలో ఉంచుకుని సురక్షితంగా ప్రయాణం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related Posts
యుద్ధ నౌకలు జాతికి అంకితం చేసిన ప్రధాని
Prime Minister Modi dedicated warships to the nation

ముంబయి: భారత నౌకాదళ అమ్ముల పొదిలోకి తాజాగా మరో 3 అస్త్రాలు చేరాయి. ముంబయిలోని నేవల్ డాక్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరై.. Read more

కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!
కేటీఆర్ కు ఏసిబి నోటీసులు!

ఫార్ములా-ఈ కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసిబి) కె.టీ. రామారావు (కేటీఆర్), బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కి 6 జనవరి ఉదయం 10 గంటలకు Read more

ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్
ఇస్రో కొత్త ఛైర్మన్‌గా వి.నారాయణన్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి ఛైర్మన్ గా, అంతరిక్ష శాఖ కార్యదర్శిగా వి. నారాయణన్ నియమితులయ్యారు, మంగళవారం చేసిన అధికారిక ప్రకటన ప్రకారం. ప్రస్తుత Read more

తెలంగాణలో ప్రారంభమైన గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ మూవ్‌మెంట్ ‘1.5 మేటర్స్’
Global Climate Action Movem

తెలంగాణ, 6 డిసెంబర్ 2024 : 1M1B (వన్ మిలియన్ ఫర్ వన్ బిలియన్) ద్వారా ఈరోజు ప్రారంభించబడిన 1.5 మేటర్స్ దేశవ్యాప్త వాతావరణ కార్యాచరణ కార్యక్రమం. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *