Nirmala Sitharaman key comments on the economic situation of Telangana

ఆ తర్వాత తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

బడ్జెట్‍‌లో తెలంగాణకు అన్యాయం జరగలేదు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన నాటికి తెలంగాణ మిగులు బడ్జెట్‌లో ఉందని, ఆ తర్వాత అప్పుల్లో కూరుకుపోయిందని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపదని ఆమె స్పష్టం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు.

  విభజన నాటికి తెలంగాణ మిగులు

బడ్జెట్‌లో బీహార్‌తో పాటు ఎన్డీయే పాలిత రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారనడం సరికాదని ఆమె అన్నారు. తెలంగాణకు కూడా నిధులు ఇచ్చామని తెలిపారు. తెలంగాణకు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ఇచ్చామని ఆమె వెల్లడించారు. రాజ్యసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కిందని ఆమె అన్నారు.

సమ్మక్క సారక్క, రామగుండం ప్లాంట్, పసుపు బోర్డు తెలంగాణకు ప్రాధాన్యతాంశాలని ఆమె పేర్కొన్నారు. పసుపు బోర్డును ఇచ్చింది ప్రధాని మోడీయే అని ఆమె అన్నారు. దివంగత ఇందిరా గాంధీ తెలంగాణలోని మెదక్ నుండి పోటీ చేసి గెలిచారని, కానీ అక్కడ రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేసింది ప్రధాని నరేంద్రమోడీ అని నిర్మలా సీతారామన్ అన్నారు.

అంతకు ముందు కేంద్ర ప్రభుత్వం లోక్ సభ ముందుకు ఆదాయపు పన్ను కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. సభను స్పీకర్ వచ్చే నెల 10 వరకు వాయిదా వేశారు. మరోవైపు కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. మోజువాణి ఓటు ద్వారా బిల్లు తీర్మాణాన్ని ఆమోదించారు.

Related Posts
Donald Trump: ట్రంప్‌ను మైక్‌తో కొట్టిన రిపోర్టర్.. అయన రియాక్షన్ ఏంటంటే?
విద్యాశాఖను రద్దు చేస్తూ ట్రంప్ ఉత్తర్వులు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అనేక షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలను అల్లాడిస్తున్నారు. అయితే Read more

నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ రోడ్లు
నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ రోడ్లు

ప్రతి సంవత్సరం, హైదరాబాద్ నుండి చాలా మంది ప్రజలు సంక్రాంతి పండుగ కోసం తమ స్వస్థలాలకు తిరిగి వెళతారు, ఈ సంవత్సరం కూడా దీనికి భిన్నంగా లేదు. Read more

ట్రంప్ ప్రకటనను ఖండించిన హమాస్..
ట్రంప్ ప్రకటనను ఖండించిన హమాస్..

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్నప్పటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న డొనాల్డ్ ట్రంప్, తాజాగా చేసిన ఒక ప్రకటనతో మరోసారి వివాదాస్పదంగా మారాడు. Read more

బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలేకు గెస్ట్ ఎవరో తెలుసా..?
biggboss final

నార్త్ లో సూపర్ సక్సెస్ సాధించిన బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లో కూడా అంతే ఆదరణ పొందుతుంది. అయితే తెలుగు విషయానికి వస్తే గత సీజన్ Read more