revanth reddy

మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు

మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
గురువారం సినీ ప్రముఖులతో సమావేశం నిమిత్తం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్‌‌కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. వారికంటే ముందే మరో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సినీ పరిశ్రమ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆలోచనలపై మంత్రులు, అధికారులతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

టాలీవుడ్ ప్రముఖుల ముందు ప్రభుత్వ ప్రతిపాదనలు
యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్‌‌కు సహకరించాలి.
ప్రచార కార్యక్రమాలలో సినిమా హీరోలే ఉండాలి.
టికెట్ల ధరలపై ప్రత్యేక సెస్‌ విధించి దానిని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌కు వినియోగిస్తాం.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ఇండస్ట్రీ సహకారం కావాలి.
ఇకపై ర్యాలీలు నిషేధించాలి.. వంటి ప్రతిపాదనలు సీఎం రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు వివరించనున్నారు.
నూతన FDC ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబు, హీరోలలో దగ్గుబాటి వెంకటేష్, అక్కినేని నాగార్జున, నితిన్, వరుణ్ తేజ్, సిద్ధు జొన్నలగడ్డ, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీ వంటివారు.. దర్శకత్వ విభాగం నుండి.. అధ్యక్షుడు వీర శంకర్, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, బాబీ, వంశీ పైడిపల్లి, డైరెక్టర్ సాయి రాజేష్, విశ్వంభర డైరెక్టర్ వశిష్ట, ప్రశాంత్ వర్మలతో పాటు.. తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, సెక్రటరీ దామోదర్ ప్రసాద్.. మా అసోసియేషన్ నుంచి, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నుంచి మరియు ఫిల్మ్ ఫెడరేషన్ నుంచి పలువురు ప్రతినిధులు హాజరు కానున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరంతా కమాండ్ కంట్రోల్ రూమ్‌ వద్దకు చేరుకున్నట్లుగా సమాచారం.

Related Posts
‘తండేల్” ట్రైలర్ వచ్చేసింది
thandel trailer

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న 'తండేల్' నుంచి ట్రైలర్ వచ్చింది. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

స్టేడియం తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది
స్టేడియం తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది

ముంబయి నగరానికి గర్వకారణమైన వాంఖెడే స్టేడియం తన 50వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. ఈ జ్ఞాపకార్థంగా ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలు Read more

భారతదేశం లో 640 మిలియన్ ఓట్ల లెక్కింపు పై ఎలన్ మస్క్ ప్రశంసలు
ఎక్స్‌పై సైబర్ దాడి ఉక్రెయిన్ పనే: మస్క్!

ఈ శనివారం ఎలన్ మస్క్ భారత ఎన్నికల విధానాన్ని ప్రశంసించారు. ఒకే రోజులో ఎన్నికల ఫలితాలను ప్రకటించే భారతదేశంలోని సిస్టమ్ సామర్థ్యాన్ని ఆయన మెచ్చుకున్నారు. అలాగే, అమెరికాలో Read more