thandel trailer

‘తండేల్” ట్రైలర్ వచ్చేసింది

అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోన్న ‘తండేల్‘ నుంచి ట్రైలర్ వచ్చింది. చందూ మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను వాలెంటైన్ వీక్ సందర్భంగా 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయబోతుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ , టీజర్ ఆకట్టుకోగా..ఇప్పుడు ఈ ట్రైలర్ సీనిమాపై మరింత అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సాయి పల్లవి, నాగ చైతన్య జోడికి, వారి కెమిస్ట్రీకి, ఆ లవ్ ట్రాక్‌కు యూత్ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యేలానే ఉంది.

Advertisements
thandel2
thandel2

మన గురించి మాట్లాడుకుంటున్నారంటే.. మనం ఫేమస్ అయిపోయినట్లే.. అనే డైలాగ్ ఈ ట్రైలర్‌లో అదిరిపోయేలా ఉంది. ఇక ప్రేమతో పాటుగా దేశ భక్తిని చాటే సన్నివేశాలు కూడా పుష్కలంగా ఉండేట్టు కనిపిస్తోంది. నాగ చైతన్య లుక్స్, యాక్టింగ్ సరి కొత్తగా ఉండబోతోన్నాయని ట్రైలర్ చెబుతోంది. ఇక సాయి పల్లవి మరోసారి ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ‘మా దేశంలో ఉన్న ఊరకుక్కలన్ని ఉత్తరం వైపు తిరిగి పోస్తే.. ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా పోయిద్ది’ అనే డైలాగ్ ఈ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలిచింది. మా యాసని ఎటకారం చేస్తే.. రాజులమ్మ జాతరే అనే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ప్రమాదం అని తెలిసినా తన మంది కోసం ముందుకు అడుగు వేసేవాడే తండేల్ అని అసలు అర్థాన్ని ట్రైలర్‌లో చెప్పేశారు. తండేల్ అంటే ఓనరా? అని అడిగితే.. కాదు సర్ లీడర్ అని అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చేశారు.

Related Posts
Pet Dog: పసిబిడ్డ ప్రాణాలను తీసిన పెంపుడు కుక్క
పసిబిడ్డ ప్రాణాలను తీసిన పెంపుడు కుక్క

శునకాలు అంటేనే విశ్వాసానికి ప్రతీకలుగా చెబుతుంటారు. ఎవరైనా ఒకసారి వాటికి కాస్త బువ్వ పెడితే చాలు.. వారి కోసం ఎంతకైనా తెగిస్తుంటాయి. ఇళ్లను, పొలాలను కాపాడడంతో పాటు Read more

సిమంధర్ ఎడ్యుకేషన్ ఏఐ చాట్‌బాట్ “డిజిటల్ శ్రీపాల్” ఆవిష్కరణ
Simandhar Education Launches AI Chatbot 'Digital Shripal'

న్యూఢిల్లీ : గ్లోబల్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కోర్సుల ప్రదాత సిమంధర్ ఎడ్యుకేషన్, CPA, CMA, CFA, ACCA, CIA మరియు EA వంటి హై-స్టేక్స్ అకౌంటింగ్ మరియు Read more

Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు
Metro Rail హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు

హైదరాబాద్ వాసులకు ఒక శుభవార్త కాదు కానీ, అవసరమైన అప్డేట్ మెట్రో రైలు ప్రయాణం త్వరలో కొంచెం ఖర్చుతో ఉండొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఛార్జీలు Read more

పెద్దపల్లి శివాలయంలో నాగదేవత విగ్రహం వద్ద నాగుపాము దర్శనం – భక్తుల ఉత్సాహం
ఓదెల శివాలయంలో మహాశివరాత్రి రోజున నాగుపాము దర్శనం

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా ఓదెల గ్రామంలోని ప్రసిద్ధ శివాలయంలో ఒక అపూర్వ సంఘటన చోటు చేసుకుంది. శివాలయ ఆవరణలో ఉన్న నాగదేవత Read more

Advertisements
×