krt

బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు: కేటీఆర్‌

ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహా రావు అని కేటీఆర్‌ అన్నారు.
భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు వర్ధంతి సందర్భంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. ఆర్థిక సంస్కరణలతో భారతదేశ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తెలంగాణలో పుట్టడం మనందరికి గర్వకారణమని చెప్పారు. గడ్డు కాలంలో దేశానికి ప్రధానిగా సేవలందించిన పీవీ.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని కాపాడారని, తన పాలనతో ఆధునిక భారతానికి బాటలు వేశారని తెలిపారు.
పీవీకి సముచితస్థానం ఇచ్చిన బీఆర్ఎస్
రాష్ట్ర ఏర్పాటు తర్వాత.. తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహా రావు గారిని బీఆర్ఎస్ ప్రభుత్వం సముచితంగా గౌరవించిందని వెల్లడించారు. పీవీ నరసింహా రావు శత జయంతి ఉత్సవాలను కేసీఆర్ ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

Advertisements

నెక్లెస్ రోడ్‌కి పీవీ మార్గ్ అని పేరు పెట్టిందని, ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసిందన్నారు. వెటర్నరీ యూనివర్సిటీకి పీవీ పేరు పెట్టిందని చెప్పారు. అంతే కాదు.. పీవీ నరసింహా రావుకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం పంపించిందని తెలిపారు. వారి కూతురిని ఎమ్మెల్సీగా గౌరవించిందన్నారు. భారతరత్న పీవీ.. తెలంగాణ ఠీవి అని ఎక్స్‌ వేదిగా ట్వీట్‌ చేశారు.

Related Posts
వస్త్ర వ్యాపారంలోకి అడుగుపెడుతున్న దువ్వాడ-దివ్వెల మాధురి!
duvvada srinivas

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన సన్నిహితురాలు దివ్వెల మాధురి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొన్నాళ్లుగా వారు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా ఉన్నారు. కుటుంబ Read more

Minister Komatireddy : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ కనుమరుగవుతోంది : మంత్రి కోమటిరెడ్డి
BRS is disappearing in the state.. Minister Komatireddy

Minister Komatireddy : నల్గొండ జిల్లాలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరోసారి బీఆర్‌ఎస్‌పై విమర్శులు గుప్పించారు. రాష్ట్రంలో Read more

Hair on bald head: బట్టతలపై జుట్టు అనగానే పరుగులు తీసారు..ఆ తర్వాత ఉన్న జుట్టు ఊడిపోయింది
బట్టతలపై జుట్టు అనగానే పరుగులు తీసారు..ఆ తర్వాత ఉన్న జుట్టు ఊడిపోయింది

హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకున్న తాజా ఘటన జుట్టు చికిత్సల పేరుతో కొనసాగుతున్న మోసాలపై మరోసారి దృష్టిని తెచ్చింది. బట్టతల సమస్యతో బాధపడుతున్నవారిని టార్గెట్ చేస్తూ మానవ మనసుల Read more

కాసేపట్లో కొండగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

కాసేపట్లో కొండగల్‌లో బీఆర్‌ఎస్‌ రైతు దీక్ష.కొండగల్‌ నియోజకవర్గంలోని కోస్గీ పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో రైతు దీక్ష జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమంలో భాగంగా, కోస్గీలో Read more

×