south korea president

దక్షిణ కొరియా అధ్యక్షుడికి అరెస్ట్ వారెంట్

దక్షిణ కొరియాలో రాజకీయ మార్పులు వేగంగా జరుగుతున్నాయి. దక్షిణ కొరియా దర్యాప్తు సంస్థ అధికారులు ఆ దేశ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు బిగ్ షాక్ ఇచ్చారు. ఓ పక్క ఎమర్జెన్సీ వివాదం నేపథ్యంలో ఇప్పటికే యూన్ సుక్ యోల్ అభిశంసన ఎదుర్కొంటుండగా, మరో పక్క యూన్‌‌‌ను అరెస్టు చేసేందుకు దర్యాప్తు అధికారులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా న్యాయస్థానం అందుకు అంగీకరించినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు.
త్వరలోనే అరెస్టు?
మార్షల్ లా ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడికి వ్యతిరేకంగా విపక్షాలు పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా, అనుకూలంగా 204 మంది ఓటు వేయగా, 85 మంది మాత్రమే వ్యతిరేకించారు. దీంతో ఆయన తన అధ్యక్ష బాధ్యతలను, విధులను ప్రధాన మంత్రి హన్ డక్ సూకి అప్పగించాల్సి ఉంటుంది అయితే యూన్‌ను తప్పించాలా ? కొనసాగించాలా ? అన్న అంశాన్ని రాజ్యాంగ న్యాయస్థానం 180 రోజుల్లో తేల్చనుంది. కాగా, యూన్ సైతం అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆయన సీనియర్ సలహాదారులు, కార్యదర్శులు పేర్కొంటున్నారు.
సియోల్ వెస్ట్రన్ డిస్ట్రిక్ట్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసినట్లు దర్యాప్తు సంస్థలోని ఉన్నత స్థాయి అధికారులు తెలిపారు. త్వరలోనే అయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే దీనిపై స్పందించేందుకు న్యాయస్థానం నిరాకరించింది.

Advertisements
president

విచారణకు గైర్హాజరు

యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించడంపైనా దర్యాప్తు జరుగుతోంది. న్యాయవాదులతో పాటు పోలీస్, రక్షణ మంత్రిత్వశాఖ, అవినీతి నిరోధక శాఖల అధికారులతో కూడిన జాయింట్ టీమ్ అధ్యక్షుడిని విచారిస్తోంది. ఈ క్రమంలో మూడు సార్లు విచారణకు నోటీసులు ఇచ్చినా ఆయన విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టు వారెంట్ కోరుతూ దర్యాప్తు అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Related Posts
న్యూ యార్క్‌లో ప్లేన్ క్రాష్: ఒకరి మృతి
small plane crash

అమెరికాలోని న్యూ యార్క్ రాష్ట్రం వెస్ట్చెస్టర్ కౌంటీలో ఒక చిన్న విమానం హైవేపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందగా, మరొకరు గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన Read more

టీమిండియా గెలుపు పై తెలుగు అభిమానుల హర్షం
టీమిండియా గెలుపు పై తెలుగు అభిమానుల హర్షం

టీమిండియా విజయం - తెలుగు వ్యక్తుల కీలక పాత్ర 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి, మూడోసారి టైటిల్‌ను సాధించింది. Read more

Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి
Mexico: ఉత్తర మెక్సికోలో పికప్ ట్రక్ లోయలో పడి 12 మంది మృతి

ఉత్తర మెక్సికోలో ఆదివారం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో 12 మంది మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీంతో అడవి మంటలు చెలరేగాయని, ఆ మంటలు తరువాత అదుపులోకి Read more

America: అమెరికాలో మైనర్లపై లైంగిక దాడి కేసులో భారతీయుడికి 35 సం. జైలు శిక్ష
అమెరికాలో మైనర్లపై లైంగిక దాడి కేసులో భారతీయుడికి 35 సం. జైలు శిక్ష

అమెరికాలోని ఓక్లహోమాలో, 31 ఏళ్ల భారతీయుడికి మైనర్లపై లైంగిక దోపిడీ, పిల్లల అశ్లీల చిత్రాల రవాణాకు సంబంధించి 35 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఈ కేసులో Read more

Advertisements
×