WhatsApp Image 2024 12 17 at 11.52.32 AM

ఢిల్లీ పాఠశాలలకు బాంబు బెదిరింపులు

దేశ రాజధాని ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారింది. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బెదిరింపులు వచ్చాయి. మంగళవారం ఉదయం ఢిల్లీలోని కొన్ని పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. దక్షిణ ఢిల్లీలోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌, నార్త్‌ వెస్ట్ ఢిల్లీలోని సరస్వతి విహార్‌లో గల ఓ పాఠశాలకు బెదిరింపులు వచ్చినట్లు చెప్పారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇ-మెయిల్‌ ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆయా పాఠశాలల వద్దకు చేరుకొని విద్యార్థులను, సిబ్బందిని ఖాళీ చేయించారు. అనంతరం బాంబ్ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్ సాయంతో పాఠశాలల ఆవరణలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
బాంబు బెదిరింపులతో బేజారు
ఇటీవల విమానాల్లో బాంబు పెట్టినట్లు ఫోన్ కాల్స్ రావడం లేదా మెయిల్స్ రావడం పరిపాటుగా మారింది. తాజాగా స్కూల్స్ లో కూడా బాంబు బెదిరింపులు రావడంతో అధికారుల తలలు పట్టుకుంటున్నారు. గత వారం రోజుల్లో ఏకంగా మూడుసార్లు ఢిల్లీ పాఠశాలలకు ఇలాంటి బెదిరింపులు రావడంతో అధికారుల అప్రమత్తం అయి తనిఖీలు నిర్వహించారు. ఫేక్ మెయిల్స్, కాల్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు పోలీసులకు చెప్పారు.

Related Posts
CM Stalin: వివాదాస్పదంగా మారిన సీఎం స్టాలిన్ పోస్ట్
CM Stalin: వివాదాస్పదంగా మారిన సీఎం స్టాలిన్ పోస్ట్

కన్నడ ప్రజల ఆగ్రహానికి కారణం ఏమిటి? తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా తెలుగు, కన్నడ ప్రజలకు Read more

ఉద్యోగాలు మానేస్తున్న భారతీయ విద్యార్థులు!
students

గతేడాది సెప్టెంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి.. అమెరికాలో ఉండే విదేశీయుల్లో ఆందోళన మొదలైంది. ఎక్కడ తాము బహిష్కరణకు Read more

IPL2025:ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరర్ గా ట్రావిస్ హెడ్
IPL2025:ఐపీఎల్ చరిత్రలో ఐదవ అత్యధిక పవర్-ప్లే స్కోరర్ గా ట్రావిస్ హెడ్

అభిషేక్ శర్మ 24 పరుగులకే ఔటయ్యాడు. కానీ ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ కలిసి విరుచుకుపడి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్ ) ఐపీఎల్ చరిత్రలో ఐదవ Read more

జాతీయ అవార్డు ఏ హీరోకు దక్కెను?
జాతీయ అవార్డు ఏ హీరోకు దక్కెను?

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాల లో భాగంగా ప్రకటించబడుతుంది. ఈ అవార్డును భారత ప్రభుత్వం ప్రధానంగా సినిమా Read more