అమెరికా వెళ్లాలనే కల చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే.. మన భారత్ లో కంటే అమెరికాలో జీవన విధానం బాగుంటుంది. ఇక్కడ ఒక్క రూపాయి సంపాదిస్తే.. అక్కడ రూ.5లకు సమానంగా ఉంటుంది. అందుకే ఎక్కువ శాతం మంది అమెరికా వెళ్లి ఎక్కువ డబ్బులు సంపాదించి.. మన ఇండియా తిరిగి రావాలని కోరుకుంటూ ఉంటారు. మరికొంత మంది గ్రీన్ కార్డు పొంది అక్కడే స్థిరపడాలనుకునే వారు కూడా ఉంటారు. దీని కోసం ఒక్క ఇండియా నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా వెళ్లాలని.. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఆ కల అందరికీ తీరకపోవచ్చు. లీగల్ గా వెళ్లి.. అక్కడే ఉంటూ లక్షల్లో సంపాదించే వాళ్లు ఉన్నారు. లీగల్ గా వెళ్లి.. విఫలమైన వాళ్లు ఆ కలను కలలాగే మిగిల్చకుండా.. దానిని సాకారం చేసుకునే విధంగా ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగా.. ఏజెంట్లను నమ్మి.. లక్షల్లో మోసం పోయిన వారు ఇల్లీగల్ గా వెళ్లేందుకు ప్రయత్నించారు. అంటే.. ఇండియా నుంచి సౌత్ అమెరికాలోని మెక్సికో దేశానికి వెళ్లి.. అక్కడ నుంచి అమెరికాకు డంకీ రూట్ ద్వారా వెళ్లారు.
డంకీ రూట్ లో అమెరికాకు వెళ్లడం అంత సులువు కాదు. ఎన్నో వ్యయప్రయాసలు కూడుకొని వెళ్లాల్సి ఉంటుంది. అడవిలో 40 కిలోమీటర్లకు పైగా కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. జర్నీ కొనసాగించాల్సి ఉంటుంది. అయితే ఈ జర్నీలో ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా డాంకీ రూట్ ఎంచుకున్న వారు అమెరికాలోకి అక్రమంగా వెళ్తుంటారు. అక్కడ బోర్డర్ లో గస్తీ కాస్తున్న పోలీసులకు దొరికితే జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇలా ఎంతో కష్టంతో కూడుకున్నది ఈ డంకీ రూట్.

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ విధానం మన దేశంతో పాటు.. ఇతర దేశాల పౌరులను, అధికారులను, రాజకీయ నాయకులను ఆలోచింపజేస్తోంది. అమెరికాలో క్రైమ్ రేట్ ఎక్కువగా పెరిగిపోవడానికి కారణం అక్కడి అక్రమ వలసదారులే అని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ని తొలగించడమే కాకుండా వాళ్ళ దేశంలో రిపీటెడ్ గా క్రైమ్స్ చేసే అమెరికన్స్ ని కూడా వేరే దేశానికి కొంత డబ్బులు పే చేసి పంపించేయాలనుకుంటోంది ట్రంప్ ప్రభుత్వం.
మన దేశంలో ఇప్పటికే కోట్ల మంది బంగ్లాదేశీయులు ఇల్లీగల్ గా నివసిస్తున్నారు. మన దేశంలో జరిగే చాలా వరకు క్రైమ్ ల వెనకాల వీళ్ళే ఉంటారు. ఇటీవల ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ పైన కూడా ఒక ఇల్లీగల్ బంగ్లాదేశీ కత్తితో అటాక్ చేశాడు. ఆ సెలబ్రిటీ ఇంటిని దోచుకుందామని ట్రై చేశాడు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కూడా ఈ ఇల్లీగల్ బంగ్లాదేశీల గురించి మన దేశంలో ఏ ఒక్క లీడర్ కూడా గట్టిగా మాట్లాడలేదు.
మన దేశంలో ఉంటున్న బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పైన భారత ప్రభుత్వం ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.