watchmen

దుబాయి వాచ్‌మెన్‌కి జాక్‌పాట్‌ 2.32కోట్లు

చాలామంది తమ జీవితంలో జాక్‌పాట్ తగలాలని కోరుకుంటారు. దానికోసం కలలు కంటారు. సరిగ్గా ఓ వాచ్‌మెన్‌ జీవితంలో కూడా ఇదియే జరిగింది. దుబాయిలో వాచ్‌మెన్‌గా ప‌నిచేస్తున్న హైద‌రాబాదీకి జాక్‌పాట్ త‌గిలింది. ఇటీవ‌ల తీసిన బిగ్ టికెట్ మిలియ‌నీర్ ఎల‌క్ట్రానిక్‌ ల‌క్కీ డ్రాలో ఏకంగా మిలియ‌న్ దిర్హ‌మ్స్ (రూ. 2.32కోట్లు) గెలుచుకున్నాడు. హైద‌రాబాద్‌కు చెందిన రాజ‌మ‌ల్ల‌య్య (60)కు ఈ బంప‌ర్ లాట‌రీ త‌గిలింది. దీంతో అత‌ని ఆనందానికి అవ‌ధుల్లేవు.
30 ఏళ్లుగా అబుదాబిలో నివాసం
హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లికి చెందిన రాజ‌మ‌ల్ల‌య్య గ‌త 30 ఏళ్లుగా అబుదాబిలో ఉంటున్నాడు. అత‌ని భార్య‌, పిల్ల‌లు ఇక్క‌డే ఉండ‌గా.. ఒంట‌రిగానే అక్క‌డ ఉంటూ, ఫ్యామిలీ కోసం క‌ష్ట‌ప‌డుతున్నాడు. నాలుగేళ్ల క్రితం స్నేహితుల ద్వారా ఈ బిగ్ టికెట్ మిలియ‌నీర్ లాట‌రీ గురించి తెలుసుకున్నాడు. అప్ప‌టి నుంచి మిత్రుల‌తో క‌లిసి లాట‌రీ టికెట్ కొనుగోలు చేయ‌డం ప్రారంభించాడు. ఇప్పుడు అదృష్టం వ‌రించ‌డంతో ఏకంగా రూ. 2.32 కోట్లు గెలుచుకున్నాడు.

Advertisements

లాటరీ నిర్వాహ‌కుల నుంచి మొద‌ట కాల్ వచ్చినప్పుడు, నేను పూర్తిగా ఆనందంలో మునిగిపోయాను. ఆ స‌మ‌యంలో నేను అనుభవించిన ఆనందాన్ని మాట‌ల్లో చెప్ప‌లేను.
ఇది నా మొదటి విజయం. ఈ న‌గ‌దు బహుమతిని నా స్నేహితులతో పంచుకుంటాను. నా వాటాగా వ‌చ్చే సొమ్మును నా కుటుంబం భవిష్యత్తు కోసం ఉప‌యోగిస్తాను. ఇక‌పై కూడా లాటరీ టికెట్ కొన‌డం కొనసాగిస్తాను” అని చెప్పుకొచ్చాడు.

Related Posts
Yashwant Verma: జస్టిస్ యశ్వంత్ వర్మ బదిలీని వ్యతిరేకిస్తున్న భారత్
Yజడ్జీల ఆస్తులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని Read more

నేడు ప్రధాని మోడీతో సమావేశం కానున్న పవన్‌ కల్యాణ్
BJP protests in Telangana from 30th of this month 1

న్యూఢిల్లీ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన బిజీబిజీగా కొనసాగుతుంది. నిన్న వరుసగా పలువురు కేంద్ర మంత్రులు, ఉప రాష్ట్రపతితో భేటీ అయిన విషయం Read more

sunita williams : రేపు ఉదయం భూమికి చేరుకొనున్న సునీతా విలియమ్స్
రేపు ఉదయం భూమికి చేరుకొనున్న సునీతా విలియమ్స్

విలియమ్స్, విల్మోర్‌లతో పాటు సిబ్బంది-9 సభ్యులు సుమారు 17 గంటల్లో భూమికి చేరుకుంటారు. మార్చి 18, 2025న ఉదయం 8:15 గంటలకు హాచ్ మూసివేత ప్రక్రియ ప్రారంభమవుతుంది. Read more

బిర్యానీ తెచ్చిన తంట 8 లక్షలు ఖర్చు ఎక్కడంటే?
గొంతులో ఇరుక్కున్న ఎముక 8 లక్షల బిల్లుషాక్ లో కుటుంబం

ఆహారం తినడం ఒక ఆనందకరమైన భాగం. అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న అపశృతి కూడా ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముంబైకి చెందిన ఓ మహిళకు రెస్టారెంట్‌లో Read more

×