japan airlines

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌ దాడి

జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ పై గురువారం సైబర్‌ దాడి జరగడంతో టికెట్ల బుకింగ్‌ సేవలు నిలిచిపోయాయి. దీంతో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఎయిర్‌పోర్ట్స్‌లో బ్యాగేజీ చెక్‌-ఇన్‌ సిస్టమ్‌లో కూడా సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని జపాన్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ వెల్లడించింది.
అంతర్జాతీయ నెట్‌వర్క్‌లలో సమస్య
గురువారం ఉదయం 7:24 గంటల నుంచి దేశీయ, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లలో సమస్యలను గుర్తించినట్లు పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ప్రయాణికులకు కలిగి అసౌకర్యానికి ఈ సందర్భంగా ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు తెలియజేసింది. కాగా.. జపాన్ ఎయిర్‌లైన్స్ ఆ దేశంలోనే రెండో అతిపెద్ద విమానయాన సంస్థ. ప్రస్తుతం సైబర్‌ దాడి కారణంగా ఈ సంస్థకు చెందిన పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణ సేవలను అందించేందుకు కృషి చేస్తున్నది.

Advertisements
Related Posts
స్వీడన్ స్కూల్‌లో కాల్పులు, 11 మంది మృతి
swedon

స్వీడన్ దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా స్కూల్‌లో కాల్పులు జరగడంతో.. ఆ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో నిందితుడు సహా మొత్తం 11 మంది Read more

భారత్, చైనాలో చమురు ధరల పెంపు?
Fuel Rates On

ఉక్రెయిన్-రష్యా దేశాలమధ్య జరుగుతున్న యుద్ధం వల్ల భారత్ పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నది. దీనితో ఉక్రెయిన్ పై యుద్దం చేస్తున్న రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా తీసుకున్న Read more

ఆస్ట్రేలియా బీచ్‌లో 3,500 కిమీ దూరం నుంచి వచ్చిన పెంగ్విన్..
penguin

ప్రకృతి ప్రపంచంలో అనేక అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్నిసార్లు అసాధారణ సంఘటనలు కూడా ఎదురుకావచ్చు. ఇటీవలి సందర్భంలో ఒక పెంగ్విన్ ఆస్ట్రేలియాలోని కోకోస్ బీచ్‌పై కనిపించింది. ఇది చాలా Read more

UN Secretary: రోహింగ్యా శరణార్థులపై నిధుల్లో కోతలు: UN సెక్రటరీ జనరల్ ఆందోళన
రోహింగ్యా శరణార్థులపై నిధుల్లో కోతలు: UN సెక్రటరీ జనరల్ ఆందోళన

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో రోహింగ్యా శరణార్థి శిబిరాలను సందర్శించారు. ఈ శిబిరాలు మయన్మార్ నుండి వచ్చిన 1 మిలియన్ Read more

×