Ponnam Prabhakar

గీతా కార్మికులకు రెండవ విడత కాటమయ్య రక్షణ కవచం కిట్ ల పంపిణీ

చెట్టు ఎక్కినప్పుడు గీతా కార్మికులు ప్రమాదాలకు గురికాకూడదనే సదుద్దేశ్యంతో రూపొందించిన కాటమయ్య రక్షణ కవచం లను బీసీ సంక్షేమ శాఖ రెండో విడత గా 10 వేల కాటమయ్య రక్షణ కవచం లను పంపిణీ చేస్తున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గత సంవత్సరం జులై 14 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడా లో కాటమయ్య రక్షణ కవచం లైవ్ డేమో చూసి గీతా కార్మికులకు ఈ కాటమయ్య రక్షణ కవచాలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి దశలో 15 వేల మందికి ఒక్కో స్పెల్ 5 వేల కిట్స్ చొప్పున వివిధ నియోజకవర్గాల్లో తాటి చెట్టు ఎక్కి కల్లు గీసే గౌడన్న లకి శిక్షణ తరగతులు ఇచ్చి కాటమయ్య రక్షణ కిట్స్ పంపిణీ చేయడం జరిగిందనీ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Advertisements

ఇప్పుడు రెండవ విడత గా మరో 10 వేల మందికి ఈ నెల 25 వ తేది లోపు జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లా ఎక్సైజ్ అధికారి సంయుక్తంగా కాటమయ్య రక్షణ కవచాల శిక్షణ మరియు కంపెనీకి అవసరమైన గోల కమ్యూనిటీకి చెందిన అర్హతగల గౌరవ వృత్తి చేసే వారిని గుర్తించి ఈ కిట్స్ పంపిణీ చేస్తారు. ఏదైనా నియోజకవర్గంలో వృత్తిరీత్యా కల్లు గీతా కార్మికులు అందుబాటులో లేకుంటే అదే జిల్లాలోని మరొక నియోజకవర్గంలో నుండి తీసుకోవచ్చు. కాటమయ్య రక్షణ కవచాలు 18 ఏళ్ల పైబడి తాటి చెట్టు ఎక్కి కల్లుగీసే వారు మాత్రమే అర్హులు గా నిర్ధరించబడతారు.
అకాడమి ఆఫ్ హ్యూమన్ ఆర్కిటెక్చర్ హైదరాబాద్ వారి శిక్షణ ఇచ్చి జిల్లా బీసీ డెవలప్మెంట్ అధికారి మరియు ఎక్సైజ్ అధికారికి ఈ కిట్స్ సరఫరా చేస్తారు. దీనిని శిక్షణ పొందిన అర్హత ఉన్న వారికి వారు ఈ కాటమయ్య కిట్స్ పంపిణీ చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

Related Posts
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతుని నాశనం చేస్తుంది: కేటీఆర్
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతుని నాశనం చేస్తుంది: కేటీఆర్

భూముల అమ్మకంపై కాంగ్రెస్ నిర్ణయం తెలంగాణ రాష్ట్రంలో భూ వ్యవహారాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కంచే-గచ్చిబౌలిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించేందుకు సన్నాహాలు Read more

మహిళలు రాజకీయంగా నష్టపోతున్నారు : ఎమ్మెల్సీ కవిత
Women are losing out politically.. MLC Kavitha

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ Read more

Metro Rail : హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు
Metro Rail హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు పెంపు

హైదరాబాద్ వాసులకు ఒక శుభవార్త కాదు కానీ, అవసరమైన అప్డేట్ మెట్రో రైలు ప్రయాణం త్వరలో కొంచెం ఖర్చుతో ఉండొచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న ఛార్జీలు Read more

రాష్ట్ర పండుగగా ‘సదర్’: ప్రభుత్వం జీవో జారీ
Sadar as state festival of telangana govt issued go

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం యాదవ్‌ సోదరులకు శుభవార్త తెలిపింది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. Read more

Advertisements
×