anita anand and trudeau

కెనడా ప్రధాని రేసు నుంచి తప్పుకొన్న అనిత

ప్రధాని పదవితో పాటు లిబరల్ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెనడా ప్రధాన మంత్రి జస్టిన్‌ ట్రూడో గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కెనడా ప్రధాని రేసులో ఉన్న మొదటి ఐదుగురిలో ప్రస్తుత రవాణా మంత్రి, భారత సంతతి మహిళా ఎంపీ అనితా ఇందిరా ఆనంద్‌ పేరు కూడా ఉంది. తాజాగా, అనిత కీలక ప్రకటన చేశారు. కెనడా ప్రధాని రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు ఎక్స్ (ట్విట్టర్)‌ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం ఓక్‌విల్లే ఎంపీగా అనిత..

తాను మళ్లీ ఎన్నికవ్వాలని కోరుకోవట్లేదని తెలిపారు. కానీ, వచ్చే ఎన్నికల వరకు ఉన్న తన బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యురాలిగా లిబరల్ టీమ్‌లో తనకు అవకాశం ఇచ్చినందుకు.. .కీలక శాఖలను అప్పగించినందుకు ట్రూడోకు, తనను ఎన్నుకున్నందుకు ఓక్‌విల్లే ప్రజలకు అనిత కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యారంగంలో సేవలు అందించాలని అనుకుంటున్నట్టు అనిత తెలిపారు.


‘‘దేశానికి, సమాజానికి మనం అనేక విధాలుగా సేవ చేయవచ్చు. కెనడాను సురక్షితంగా, బలంగా, స్వేచ్ఛగా ఉంచడానికి ఓ ప్రజా ప్రతినిధిగా నేను చేయాల్సినవన్నీ చేశాను.. .నేను పుట్టడానికి ముందే కెనడాకు వలస వచ్చిన నా తల్లిదండ్రులు.. ఈ దేశ గొప్పదనం..

మాకు అందించిన సహకారాన్ని చెబుతూ పెంచారు. కాబట్టి మా లిబరల్ పార్టీ కోసం, ఓక్‌విల్లే కోసం..అన్నింటి మించి కెనడా కోసం నేను ఇక్కడ ఉంటాను’’ అని అనిత చెప్పారు. తాను మొదటిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడు భారత సంతతి మహిళ గెలవలేదని ప్రచారం చేశారు. కానీ, అక్కడి ప్రజలు మాత్రం తనను ఒకటి కాదు రెండుస్లారు గెలిపించారని చెప్పారు. దీనిని ఎంతో గౌరవంగా భావించి.. జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటానని అన్నారు.
ట్రూడో వారసుడ్ని నాయకుడిని ఎన్నుకునే పనిలో లిబరల్ పార్టీ నిమగ్నమైంది.

Related Posts
ఆఫ్రికాలో బంగారు గని విరిగిపడి 42 మంది కార్మికుల మృతి
Gold mine collapse kills 42

చైనా కంపెనీ నిర్వహణలో గని ఆఫ్రికా ఖండంలోని మాలి దేశంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు మాలి ప్రాంతంలో ఉన్న ఓ బంగారు గని కుప్పకూలి 42 Read more

Trump : ఎల్ సాల్వడార్ మెగా-జైలు – ట్రంప్ బహిష్కరణ వ్యూహం
ఎల్ సాల్వడార్ మెగా-జైలు - ట్రంప్ బహిష్కరణ వ్యూహం

ఎల్ సాల్వడార్‌లో నేరాలను అణచివేయడానికి అధ్యక్షుడు నయీబ్ బుకెలే కఠినమైన వ్యూహాలను అనుసరిస్తున్నారు. ఈ వ్యూహంలో ముఖ్యమైన భాగంగా టెర్రరిజం కన్ఫైన్‌మెంట్ సెంటర్ (CECOT) అనే మెగా-జైలు Read more

ఐసీసీపై ట్రంప్ ఆంక్షలు
గాజాను స్వాధీనం చేసుకుంటాం: ట్రంప్

రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. వివిధ దేశాలపై సుంకాలను వడ్డిస్తూ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. Read more

ఎలాన్ మస్క్ మళ్ళీ రికార్డు: నెట్ వర్థ్ $300 బిలియన్ ని దాటింది
elon

ప్రపంచంలో అతి ధనవంతులైన వ్యక్తుల జాబితాలో ఎలాన్ మస్క్‌ను ఎప్పటికప్పుడు చూస్తాం. తాజాగా, ఎలాన్ మస్క్‌ ఆర్థికంగా మరింత ఎదుగుదలను సాధించారు. ఆయన నెట్ వర్థ్‌ $300 Read more