Revanth Reddy letter to Prime Minister Modi

Revanth Reddy : ప్రధాని మోడీకి రేవంత్ రెడ్డి లేఖ

Revanth Reddy : ప్రధాని మోడీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ ఆ లేఖ రాశారు. స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టారు. ఆ రెండు బిల్లులు అమోదం పొందాయి. ఈ నేపథ్యంలో బిల్లులకు కేంద్రం మద్ధతు కోరేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి లేఖలో విజ్ణప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కలిసి కట్టుగా అందరం ప్రధాని మోడీ వద్దకు వెళ్దామని ఆయన అన్ని పార్టీలకు పిలుపు నిచ్చారు.

Advertisements
image

బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత

ఆ క్రమంలో ప్రధాని మోడీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీలకు రిజర్వేషన్లపై పార్టీలకతీతంగా ఐక్యంగా ఉన్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. 1979లోనే ఈ రిజర్వేషన్ల కోసం మండల్‌ కమిషన్‌ వేశారని గుర్తు చేశారు. మండల్‌ కమిషన్‌తోనే బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో 56.36 శాతం బలహీనవర్గాలు ఉన్నాయని వివరించారు. లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చెప్పినట్లే.. తెలంగాణలో కులగణన చేశామన్నారు. గతేడాది ఫిబ్రవరి 4న కేబినెట్‌లో తీర్మానం చేశామని చెప్పారు.

Related Posts
మెడికల్ షాపుల్లో ఈ మందులు కొంటున్నారా?
medical shops

ఈరోజుల్లో మనిషి బ్రతుకుతున్నాడంటే అది టాబ్లెట్స్ వల్లే అని చెప్పాలి. ఒకప్పుడు ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకునేవారు..టాబ్లెట్స్ అనేవి పెద్దగా వాడే వారు కాదు..మరి ఎక్కువైతే ఆయుర్వేదం Read more

Vijay Sai Reddy: జగన్ ను విమర్శించిన విజయసాయిరెడ్డిని తిప్పి కొట్టిన సుబ్బారెడ్డి
Vijay Sai Reddy: జగన్ ను విమర్శించిన విజయసాయిరెడ్డిని తిప్పి కొట్టిన సుబ్బారెడ్డి

విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్ర స్పందన ఏపీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి ఇటీవల రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి విచారణకు హాజరైన Read more

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ
రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు జారీ

న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. గతేడాది Read more

Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?
Assam: అస్సాం ఎమ్మెల్యేకి కోపం వచ్చింది ఆ తర్వాత ఎం చేసాడు?

బ్రిడ్జి ప్రారంభోత్సవంలో వివాదం అసోంలోని బిలాసిపర (ఈస్ట్) నియోజకవర్గ ఎమ్మెల్యే సంసుల్ హుడా ఇటీవల ఓ బ్రిడ్జి భూమిపూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఊహించని సంఘటన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×