Andhrapradesh :ఏపీ లో లులు మాల్స్ ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

Andhrapradesh :ఏపీ లో లులు మాల్స్ ఏర్పాటు కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటు చేసేందుకు లులు గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం విశాఖపట్నంలో లులు మాల్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించినా, ప్రభుత్వ మార్పుతో అది హైదరాబాద్‌కు తరలిపోయింది. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, లులు సంస్థ రాష్ట్రంలో మాల్స్‌ ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలిపింది. వైజాగ్ మాల్ ప్రతిపాదనకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతి ఇచ్చిందని, కేబినెట్ దీనికి ఆమోదం తెలిపిందని సీఎం పేర్కొన్నారు.

Advertisements

నరేంద్రమోదీ చేతుల మీదుగా

అమరావతి రాజధాని నిర్మాణ పనులను ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా పునఃప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నేడు ఢిల్లీకి వెళ్లి ప్రధానితో భేటీ కానున్నారు.ఈ సందర్బంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల జాబితాను సమర్పించి, వాటిని విడుదల చేయాలని కోరనున్నారు. అమరావతి అభివృద్ధి, కీలక పెట్టుబడుల ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలకు నిధుల మంజూరుపై ప్రధానితో చర్చలు జరపనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ భేటీ కీలకంగా మారనుంది.

విశాఖపట్నంలో లులూ గ్రూప్ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్ నిర్మాణంపై ,తిరుపతిలో లులూ మల్టీప్లెక్స్, విజయవాడలో లులూ హైపర్ మార్కెట్ నిర్మాణం గురించి చర్చించినట్లు తెలిపారు.ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్‌లోనూ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించినట్లు,ప్రభుత్వం నుంచి అన్నిరకాలుగా ప్రోత్సాహం అందిస్తామని వారికి తెలియజేశారు.త్వరలోనే విశాఖపట్నం వాసులను లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.విశాఖలో మాల్ నిర్మాణ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు అనుమతి ఇచ్చి, కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ మాల్స్ ద్వారా ఆర్థిక అభివృద్ధి, పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.

లులు మాల్స్ ప్రధానంగా షాపింగ్, వినోదం, భోజనం, విశ్రాంతి కోసం రూపొందించబడతాయి. ఈ మాల్స్‌లో అంతర్జాతీయ దేశీయ బ్రాండ్‌ స్టోర్లు, హైపర్‌మార్కెట్‌లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్‌లు వంటి సౌకర్యాలు ఉంటాయి. క్రయదారులకు అన్ని విభాగాల ఉత్పత్తులు ఒకేచోట లభించే విధంగా లులు మాల్స్‌ను తీర్చిదిద్దుతారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా లులు మాల్స్ అన్ని వయసుల వారికి ఉంటాయి.అందుబాటులో

Related Posts
పోసాని కేసు హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు
పోసాని కేసు హైకోర్టుకు వెళతామన్న పొన్నవోలు

సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళికి రైల్వేకోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో Read more

క్రికెట్ మ్యాచ్ కు హాజరవడంపై లోకేష్ కామెంట్స్
lokesh match

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు హాజరయ్యారు. అయితే, రాష్ట్రంలో గ్రూప్-2 అభ్యర్థుల Read more

ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు
99 rs

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త Read more

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు... రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్

ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు… రంగంలోకి కేరళ డాగ్ స్క్వాడ్ నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటరు వద్ద జరిగిన Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×