WPL 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సరికొత్త ఆటగాడు చేరారు.ఇంగ్లండ్ స్టార్ బౌలర్ చార్లీ డీన్, సోఫీ మోలినక్స్ స్థానాన్ని భర్తీ చేస్తూ RCB జట్టులోకి ప్రవేశించింది.మోకాలి గాయం కారణంగా సోఫీ లీగ్‌కి దూరమవ్వగా, చార్లీ డీన్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. 24 ఏళ్ల డీన్‌కు ఇప్పటికే 78 అంతర్జాతీయ మ్యాచ్‌ల అనుభవం ఉంది.ఈ మ్యాచ్‌లలో 120 వికెట్లు తీసింది. ఆమె టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో ఇంగ్లండ్ జట్టును ప్రాతినిధ్యం వహించింది.చార్లీ డీన్ ప్రత్యేకత ఆమె స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా రాణించడం. 2017లో పాఠశాల జట్టులో అరంగేట్రం చేసిన డీన్ మొదటి మ్యాచ్‌లోనే 5 వికెట్లు తీసి మెరిసింది.

2018లో హాంప్‌షైర్ అండర్-15 జట్టుకు కెప్టెన్‌గా ఉన్న డీన్, రాయల్ లండన్ కౌంటీ కప్‌ను గెలిపించింది.ఆమె తండ్రి స్టీవెన్ కూడా క్రికెటర్ కావడంతో, చిన్ననాటి నుంచి క్రికెట్‌పై ప్రత్యేక ఆసక్తి పెరిగింది.చార్లీ డీన్ 2021లో వన్డేల్లో, 2022లో టెస్టు మరియు టీ20ల్లో ఇంగ్లండ్ తరపున అరంగేట్రం చేసింది.ఇప్పుడామె ఇంగ్లండ్ జట్టులో కీలక సభ్యురాలిగా కొనసాగుతోంది.ఇప్పుడు తొలిసారిగా WPLలో అడుగుపెడుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ జట్టుతో జతకట్టడం ఆమెకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.చార్లీ డీన్ 36 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 46 వికెట్లు సాధించింది.
ఆమె ఇప్పటివరకు ఇంగ్లండ్ మహిళల హండ్రెడ్ లీగ్‌లో మాత్రమే ఆడింది.హండ్రెడ్ లీగ్‌లో 30 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు తీసింది.ఇప్పుడు WPL 2025లో ఆమె అనుభవం RCB కెప్టెన్ స్మృతి మంధానకు గొప్ప బలం అవుతుందని ఆశిస్తున్నారు. టైటిల్‌ను కాపాడుకోవడంలో చార్లీ డీన్ కీలక పాత్ర పోషించనుంది.ఆమె స్పిన్ బౌలింగ్ మరియు ఆల్‌రౌండ్ ప్రతిభతో RCB జట్టు మరింత బలపడనుంది.అభిమానులు ఆమె ప్రదర్శనను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.చార్లీ డీన్ ఈ అవకాశాన్ని ఎంతగా పయోగించుకుంటుందో చూడాలి!