formers

రైతుభరోసా పరిమితి, మార్గదర్శకాలు

రైతులకు తమ ప్రభుత్వం మేలుచేస్తున్నదని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఆ దిశగా చర్చలను కొనసాగిస్తున్నది. ఇందులో భాగంగా రైతు భరోసా అర్హత .. పరిమితి పైన మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించింది. సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం లభించింది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. సంక్రాంతికి రైతుభరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisements
rythu bharosa telangana

కీలక ప్రతిపాదనలు
ఐటీ చెల్లిస్తున్న వారిలో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి.. ఎవరిని కొనసాగించాలి అనే అంశం పైన కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపు దారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది.
20 లక్షల మంది కి కోత?
గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చారు. ప్రభుత్వం సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు 20 లక్షల మంది కి కోత పడే అవకాశం ఉందని అంచనా.

జనవరి తొలి వారంలోనే విధి విధానాలు పూర్తి చేసి.. మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

వీరికి మినహాయింపు
వారికి మినహాయింపు పీఎం – కిసాన్ లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులకు పథకం అమలు చేయటం లేదు. ఇదే విధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందుల పైనా చర్చ జరిగింది.

ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా రూ 80,453 కోట్లు చెల్లించగా.. ఇందులో సాగు భూముల కోసం రూ 21,284 కోట్లు చెల్లించారని అధికారులు నివేదిక ఇచ్చారు.

Related Posts
ఆస్థి తగాదాలే హత్య కు కారణం-ఎస్పీ
ఆస్థి తగాదాలే హత్య కు కారణం-ఎస్పీ

భూపాలపల్లి జిల్లాలో సంచలనం సృష్టించిన భూ వివాద హత్యకేసులో పోలీసులు కీలక ముందడుగు వేశారు. నాగవెల్లి రాజలింగమూర్తి హత్యకు సంబంధించి ఏడుగురిని అరెస్టు చేసి, నిందితుల హత్యా Read more

Toshiba : తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న తోషిబా
Toshiba తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతున్న తోషిబా

తెలంగాణలో మరో కీలక పెట్టుబడి ప్రాజెక్ట్‌ జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ తోషిబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టీటీడీఐ (ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా), రాష్ట్రంలో Read more

హైదరాబాద్లో మరో కొత్త జైలు..?
hyd new jail

హైదరాబాద్లో మరో కొత్త జైలు ఏర్పాటు చేసేందుకు జైళ్ల శాఖ అధికారులు యోచిస్తున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీనిని ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం Read more

పీఎం కిసాన్ నిధులు విడుదల
Release of PM Kisan funds

పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల రైతులకు శుభవార్త! పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులు విడుదల అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, Read more

Advertisements
×