11 2

మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన పిన్నెల్ని రామకృష్ణారెడ్డి

అమరావతి: మరోసారి వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఆయన గతంలో విధించిన బెయిల్ షరతులను సడలించాలని, విదేశాలకు వెళ్లేందుకు పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరారు. శుక్రవారం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిన్నెల్లి తరఫున న్యాయవాది రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్ కుమారుడు సింగపూర్‌లో ఉన్నత విద్యను కొనసాగించడానికి వెళ్ళనున్నాడు కాబట్టి, తండ్రిగా పిన్నెల్లి కూడా ఆయనతో పాటు వెళ్లాల్సి ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. పాస్‌పోర్టు విడుదలకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

ఇప్పటికే పోలీసుల తరఫున న్యాయవాది ఎన్ అశ్వనీకుమార్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరగా, హైకోర్టు 28వ తేదీకి విచారణను వాయిదా వేసింది. మునుపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం, టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆ కేసుల సందర్భంగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. తర్వాత ఆయన హైకోర్టును ఆశ్రయించి షరతులతో కూడిన బెయిల్ పొందారు, ఈ నేపథ్యంలో బెయిల్ షరతుల సడలింపునకు పిటిషన్ దాఖలు చేశారు.

Related Posts
AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలి : అక్బరుద్దీన్ ఒవైసీ
Survey should be conducted in GHMC with AI technology.. Akbaruddin Owaisi

హైదరాబాద్‌: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ..AI టెక్నాలజీతో జీహెచ్ఎంసీలో సర్వే చేయాలని పేర్కొన్నారు. నాంపల్లిలో డబుల్ ఓటర్ కార్డులున్నాయి. ఓటర్ కార్డులో ఒక అడ్రస్ ఉంటే.. Read more

అసెంబ్లీ లో ప్రసంగిస్తున్నా గవర్నర్ వాడి వేడి చర్చలకు అవకాశం
అసెంబ్లీ లో ప్రసంగిస్తున్నా గవర్నర్ వాడి వేడి చర్చలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం, సభ వాయిదా Read more

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుండి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల సందడి నెలకొననుండగా, Read more

శాసనసభలో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల ప్రణాళిక
శాసనసభలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల

శాసనసభలో క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల ప్రణాళిక.గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారితో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం జరిగింది. ఈ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *