I will be with Pawan Kalyan, whether he holds office or not.. Balineni

janasena : పదవి ఉన్నా, లేకున్న పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా : బాలినేని

janasena : మాజీ మంత్రి, ఆ పార్టీ నేత బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కాకినాడ జిల్లా పిఠాపురం శివారులోని చిత్రాడలో ఏర్పాటు చేసిన ‘జయ కేతనం’ సభలో మాట్లాడారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో సినిమా తీయాలనేది తన కోరిక అని, ఇదే విషయం ఆయనకు చెప్పానని అన్నారు. పిఠాపురం సాక్షిగా అన్నీ నిజాలే చెబుతా. నాకు ప్రాణం ఉన్నంత వరకు.. పదవి ఉన్నా, లేకపోయినా పవన్‌ కల్యాణ్ వెంటే ఉంటా. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయా. మా తండ్రి ఇచ్చిన ఆస్తిలో సగం అమ్మేశా అన్నారు.

Advertisements
janasena  పదవి ఉన్నా, లేకున్న

చేసిన పాపాలు ఎక్కడికీ పోవు

జగన్‌ వల్ల నేను, నా కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డాం. నా ఆస్తులు, నా వియ్యంకుడికి ఉన్న ఆస్తులను కూడా జగన్‌ కాజేశారు. జగన్‌ చేసిన అన్యాయాలు చెప్పాలంటే సమయం సరిపోదు. రఘురామకృష్ణరాజు ఏదో అన్నారని లోపల పెట్టి ఆయన్ను కొట్టించావు. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు అని జగన్‌ తెలుసుకోవాలి. కూటమి ప్రభుత్వం వచ్చాక చిన్న చిన్న వారిని అరెస్టు చేస్తున్నారు. స్కాములు చేసి, రూ.కోట్లు సంపాదించిన వారిని ఇంకా అరెస్టు చేయడంలేదు.. అదే నా బాధ. వైఎస్‌ను అడ్డం పెట్టుకుని జగన్‌ సీఎం అయ్యారు. పవన్‌ కల్యాణ్‌ స్వశక్తితో ఎదిగి నాయకుడు అయ్యారు అని బాలినేని అన్నారు.

Related Posts
నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy will start Indiramma Houses today

మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా Read more

Bird flu : ఏపీలో బర్డ్ ఫ్లూతో 6 లక్షల కోళ్లు మృతి – అంతర్జాతీయ సంస్థ
bird flu

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ (H5N1) వ్యాప్తి చెందుతోంది. బహుప్రసిద్ధ కోళ్ల పెంపక కేంద్రాలైన వెల్పూరు (పశ్చిమ గోదావరి) మరియు కనూరు (తూర్పు Read more

Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్
Sunita Williams: ఉత్కంఠకు తెర భూమి మీదకు రానున్న సునీత విలియమ్స్

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో తొమ్మిది నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ మరియు ఆమె సహచరుడు బచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి Read more

బడ్జెట్‌పై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే స్పందన
బడ్జెట్‌పై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే స్పందన

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శనివారం 2025 కేంద్ర బడ్జెట్‌ను విమర్శించారు. ఇది "బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేసినట్టు" ఉందని వ్యాఖ్యానిస్తూ, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడానికి ప్రధాని Read more

×