nirmala

ఫిబ్రవరిలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు

పార్లమెంట్‌లో ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల తేదీలను తాజాగా ప్రకటించారు. ఈ పార్లమెంటరీ సమావేశాలు 31 జనవరి 2025న ప్రారంభమై అలాగే ఏప్రిల్ 4న ముగుస్తాయి. ముఖ్యంగా బడ్జెట్ FY26 ప్రకటన ఫిబ్రవరి 1న జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు రెండు సెషన్లుగా నివహించనున్నారు. మొదటి సెషన్ జనవరి 31న ప్రారంభమై 13 ఫిబ్రవరి 2025న వరకు అంటే రెండు వారాల పాటు కొనసాగుతుంది. రెండవ సెషన్ మార్చి 10న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తుంది.


భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 31 జనవరి 2025న న్యూఢిల్లీలో ఉదయం 11:00 గంటలకు లోక్‌సభ ఛాంబర్‌లో పార్లమెంట్ సమావేశంలో ప్రసంగిస్తారు. దీని తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1వ తేదీన దేశంలో ఆర్థిక మంత్రిగా తన ఎనిమిదో బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఇప్పటివరకు ఆమె ఆరు అన్యువల్ బడ్జెట్‌లు ఇంకా రెండు ఇంటర్మ్ బడ్జెట్‌లను సమర్పించారు, దింతో భారతదేశంలో అత్యధిక బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ రికార్డును నిర్మలమ్మ అధిగమించారు.
మరో బలమైన ఆర్‌బిఐ డివిడెండ్ ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికలకు మద్దతునిస్తుందని మా విశ్లేషణ సూచిస్తుంది. ఈ బడ్జెట్ స్వల్పకాలిక ఇంకా దీర్ఘకాలిక నిర్మాణ మార్పుల ద్వారా వృద్ధిని పెంచడంపై దృష్టి పెట్టాలి. ప్రయివేటు పెట్టుబడులు నెమ్మదిగా సాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మూలధన వ్యయంపై దృష్టిని కొనసాగించే అవకాశం ఉంది.

Related Posts
హైదరాబాదులో విప్రో విస్తరణ.. భారీగా ఉద్యోగాలు
wipro

రెండు రోజుల కింద టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న హెచ్సీఎల్ టెక్నాలజీస్ ప్రతినిధులు దావోస్ వేదికగా హైదరాబాదులో తమ కార్యకలాపాలను రానున్న నెలలో విస్తరించటం ద్వారా Read more

డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్
డాన్స్ చేస్తూ యువతి మృతి.. వీడియో వైరల్

అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతున్న ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. అప్పటిదాకా సంతోషంగా గడిపిన ఆ కుటుంబం బోరున విలపించింది. సోదరి పెళ్లి వేడుకలో డాన్స్ Read more

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధింపు
Imposition of President Rule in Manipur

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్ జారీ ఇంఫాల్: దేశ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. Read more

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్
Rahul Gandhi reached Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. Read more