230804 Rahul Gandhi mjf 1459 53615f

లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ఆగ్రహం

లోక్‌సభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజలకు తాము అభయముద్ర గురించి చెబుతుంటే.. ప్రభుత్వం మాత్రం వారి బొటనవేళ్లను నరుకుతామంటోందని వ్యాఖ్యానించారు. ఏకలవ్యుని బొటనవేలు తీసుకుని ద్రోణుడు అతడిని విలువిద్యకు దూరం చేసినట్లే.. ప్రభుత్వం ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తోందనే ఉద్దేశంతో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యువత జీవితాలతో ఆటలు వద్దు
కేంద్ర ప్రభుత్వ విధానాలు యువత జీవితాలతో ఆడుకుంటున్నదని, అనేకులు నిరాశలో జీవిస్తున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేసారు. ‘సైన్యంలోకి అగ్నివీర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను నరికేశారు. ఏకంగా 70 పరీక్షల పేపర్‌ లీకేజీలు జరిగినప్పుడే మీరు దేశ యువత బొటన వేళ్లను తెగగొట్టారు. ఇప్పుడు కూడా మీరు ఢిల్లీ బయట దేశ రైతులపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగిస్తున్నారు. లాఠీచార్జి చేస్తున్నారు. రైతులు మిమ్మల్ని కనీస మద్దతు ధర కల్పించమని కోరుతున్నారు. తమ పంటకు తగ్గ ధర కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. కానీ మీరు మాత్రం అదానీ, అంబానీలకు లాభాలు కట్టబెట్టి రైతుల బొటన వేళ్లను నరికేశారు’ అని రాహుల్ గాంధీ సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
‘మేం దేశ ప్రజలకు అభయముద్ర గురించి చెబుతున్నాం. భయం వద్దు, ధైర్యంగా ఉండాలంటూ అభయమిస్తున్నాం. మీరు మాత్రం వారి బొటన వేళ్లను నరికేస్తాం అంటున్నారు. మీకూ, మాకు ఉన్న తేడా అదే’ అని రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ ప్రసంగిస్తున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ కనిపించారు. శుక్రవారం తొలిసారి లోక్‌సభలో ప్రసంగించిన ప్రియాంకాగాంధీ కూడా ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Advertisements
Related Posts
IPL 2025: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌
IPL2025: టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌

​ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2025లో భాగంగా, కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జి) జట్ల మధ్య మ్యాచ్ ఈ రోజు Read more

ట్రంప్ ఆర్థిక వ్యూహం పైప్రభావం
సుంకాల నుంచి భారత్‌ ఉపశమనం పొందవచ్చు..భారత్ ఆశాభావం!

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులతో పాటు పన్నుల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాతో వ్యాపారం చేసే దేశాలు అధిక Read more

America: గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆపేసిన అమెరికా భారతీయులకు భారీ షాక్..
America: గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ ఆపేసిన అమెరికా భారతీయులకు భారీ షాక్..

డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా నుంచి పంపించేందుకు Read more

పి ఎస్ ఎల్ వి రాకెట్ ప్రయోగం విజయవంతం
PSLV rocket launch successf

శ్రీహరికోట : శ్రీహరికోట నుండి ఇస్రో ప్రయోగించిన పి ఎస్ ఎల్ వి - సి 59 ప్రయోగం విజయవంతం అయ్యింది. అంతరిక్ష కక్షలోకి చేరిన ప్రోబా Read more

×