ram gopal Varma

రాంగోపాల్ వర్మకు నోటీసులు

విజయవాడ: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు రాష్ట్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయన సినిమా “వ్యూహం”కి సంబంధించి గత ప్రభుత్వంతో తీసుకున్న నిధుల విషయంలో ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది.”వ్యూహం” సినిమా, అవసరమైన వ్యూస్ సాధించకపోయినా, ఫైబర్నెట్ నుంచి 15 లక్షల రూపాయలు అనుచితంగా పొందినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని రామ్ గోపాల్ వర్మకు లీగల్ నోటీసులు జారీ చేశారు. ఫైబర్నెట్ చైర్మన్ జి.వి.రెడ్డి ఆదేశాల ప్రకారం, ఆ సంస్థకు చెందిన ఐదుగురు ఉన్నతాధికారులకు కూడా నోటీసులు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోగా వడ్డీతో సహా మొత్తం చెల్లించాల్సిందిగా సూచించారు. వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉండటం, అందులో ఒక్కో వ్యూస్కు 11 వేల రూపాయల చొప్పున లభించిన మొత్తాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా చెల్లించినట్లు జి.వి.రెడ్డి పేర్కొన్నారు.

ఈ విషయంపై వివరణ కోరుతూ లీగల్ నోటీసులు ఇచ్చామని ఆయన వెల్లడించారు.ఫైబర్నెట్ సంస్థ చెల్లింపుల వ్యవహారంపై ప్రస్తుత చైర్మన్ జి.వి.రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 2016లో రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ సంస్థను స్థాపించింది. ఈ సంస్థ ప్రధాన ఉద్దేశం గ్రామీణ ప్రాంత ప్రజలకు తక్కువ ధరలకు కేబుల్, ఇంటర్నెట్ సేవలు అందించడం. 2019లో 24,000 కిలోమీటర్ల కేబుల్ వేసి 10 లక్షల కనెక్షన్లు అందించినట్లు తెలిపారు.ఇప్పుడు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంస్థ సాంకేతికంగా దివాలా దశకు చేరుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. 5 లక్షల కనెక్షన్లు మాత్రమే ఉండడం, సంస్థను నిర్వహించే ఖర్చుల వృద్ధి, అక్రమ ఉద్యోగ నియామకాల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ విషయం మీద విజిలెన్స్ విచారణ జరుగుతోందని జి.వి.రెడ్డి చెప్పారు.గత ప్రభుత్వ సమయానికీ కొన్ని తప్పిదాలు చోటుచేసుకున్నాయి. 1,363 మంది ఉద్యోగులను నియమించి, వారికీ నెలవారీ 4 కోట్లు వేతనాలు చెల్లించడం, అదే సమయంలో కనెక్షన్లు పెరగకుండా ఉండడం ఆ సమయంలో జరిగిన నేరాల్ని చూపుతాయన్నారు.

Related Posts
నటి సోనాలి బింద్రేతో ప్రేమాయణం పై మౌనం
Sonali Bendre

పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది, బాలీవుడ్ నటి సోనాలి బింద్రేతో సంబంధం పట్ల సర్క్యులేట్ అయ్యిన పుకార్లను స్పష్టంగా ఖండించారు. ఇటీవల జరిగిన ఒక ఉర్దూ Read more

పంజాబీ డ్రెస్‌లో కేరళ కుట్టి 50కి దగ్గరైనా తగ్గడం లేదుగా
suma kanakala

తెలుగు బుల్లితెరపై కీర్తి తెచ్చుకున్న స్టార్ యాంకర్ సుమ కనకాల, అనేక మంది వచ్చినా ఇంకా తన స్థానాన్ని దృఢంగా నిలబెట్టుకున్నారు. కేరళలో జన్మించిన సుమ, 20 Read more

స‌లార్ పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడంటే?
salaar 2

పాన్-ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్’ విడుదలై నేటితో (డిసెంబర్ 22) Read more

Tollywood : తెలుగు హీరోలకు విలన్స్‌గా మారిన బాలీవుడ్ స్టార్స్.. సైఫ్ అలా.. బాబీ ఇలా
Bollywood actors Telugu movies

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా దుమ్ము రేపుతోంది సెప్టెంబర్ 27న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాన్ని సాధించి 500 కోట్లకు Read more