ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై దాడికి ట్రై చేసారు. ఆయనపై ఒక వ్యక్తి ద్రవ పదార్థం (లిక్విడ్) విసిరిన సంఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై ఆప్ సీరియస్‌గా స్పందిస్తూ, ఇది సామాన్య దాడి కాదని, పధకం తోనే ఆసిడ్ దాడి అని ఆరోపించింది. అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకోవడంతో అరవింద్ కేజ్రీవాల్ ఆ దాడి నుంచి తప్పించుకున్నారు. అక్కడే ఉన్న కార్యకర్తలు యువకుడిని పట్టుకుని చితకబాదారు.
అతడి వద్ద ఉన్న బాటిల్‌ను పరిశీలించగా అందులో స్పిరిట్ ఉన్నట్లు తేలిందని ఆప్ నేతలు చెబుతున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. దీనికి ముందు కేజ్రీవాల్ ప్రసంగిస్తూ ఢిల్లీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళనవ వ్యక్తం చేశారు. ఢిల్లీని గ్యాంగ్ స్టర్లు నడిపిస్తున్నారని ఆరోపించారు. దుకాణాలపై జరుగుతున్న దాడుల వల్ల వ్యాపార వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కేజ్రీవాల్‌ను లక్ష్యంగా చేసుకుని దాడికి యత్నించిన ఘటన ఇదే మొదటిసారి కాదు. 2016లో రాజస్థాన్‌లోని బికనెర్‌లో పర్యటించినప్పుడు ఆయనపై దాడి యత్నం జరిగింది. 2013లో కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలాంటి దాడులు ఆయనకు కొత్తకాదు.