vande bharath

త్వరలో వందే భారత్‌ తొలి స్లీపర్‌ రైలు!

త్వరలో భారత్‌ తొలి స్లీపర్‌ రైలు రానున్నది. భారతీయులు ఎదురుచూస్తున్న వందే భారత్‌ స్లీపర్‌ రైలు రానున్నాయి. భారతీయ రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. లోడెడ్‌ సిమ్యులేషన్‌ ట్రయల్స్‌ కోసం కోచ్‌లను ఐసీఎఫ్‌ చెన్నైకి పంపినట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ట్రయల్‌ తర్వాత రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తాయన్నారు. భారతదేశపు తొలి స్లీపర్‌ వందే భారత్‌ రైలు త్వరలో ట్రయల్‌ రన్‌ మొదలవనున్నది. అయితే, ట్రయల్‌ రన్‌ పూర్తయ్యేందుకు దాదాపు రెండునెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం తొలి రైలు ఏ మార్గంలో నడుస్తుందనే చర్చ సాగుతున్నది.
రైల్వేబోర్డుకు భారీగా ప్రతిపాదనలు
దేశంలోని వివిధ రైల్వే జోన్ల నుంచి రైల్వేబోర్డుకు భారీగానే ప్రతిపాదనలు వచ్చినట్లు రైల్వేవర్గాలు పేర్కొన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబయి నుంచి ప్రారంభించేందుకు ఎక్కువగా అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. ఈ విషయంలో త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వందే భారత్‌ స్లీపర్‌ రైలు చార్జీలు రాజధాని ఎక్స్‌ప్రెస్‌తో సమానంగా ఉంటాయని రైల్వేశాఖ మంత్రి ఇప్పటికే స్పష్టం చేశారు.

Advertisements
Related Posts
రేపు లోక్‌సభలో జమిలి ఎలక్షన్‌ బిల్లు..!
elections

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకే దేశం-ఒకే ఎన్నిక Read more

భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?
భారత్-పాకిస్తాన్ ఫ్లాగ్ మీటింగ్ – శాంతి ఒప్పందానికి కొత్త దారి?

జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి శుక్రవారం భారత్, పాకిస్తాన్ మధ్య బ్రిగేడ్ కమాండర్ స్థాయి ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. ఇటీవల జరిగిన Read more

కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా
కేటీఆర్ పిటిషన్ ఫిబ్రవరికి వాయిదా

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు విచారించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై Read more

Jio News: అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో
అన్‌లిమిటెడ్ క్రికెట్ ఆఫర్ ఇస్తున్న రిలయన్స్ జియో

దేశంలోని మీడియా రంగంలో అతిపెద్ద సంస్థగా అవతరించిన రిలయన్స్ జియో ప్రస్తుతం అన్ లిమిటెడ్ ఆఫర్‌తో ప్రజల ముందుకు తిరిగి వచ్చేస్తోంది. త్వరలోనే ఐపీఎల్ సీజన్ మెుదలు Read more

×