Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్​ స్కీ

Read Time:  1 min
Maha Kumbhabhishekam: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం
Maha Kumbhabhishekam: 270 ఏళ్ల తర్వాత పద్మనాభస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం
FONT SIZE
GET APP

శాంతి చర్చలు జరుగుతున్న వేళ రష్యాపై దాడి చేయడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్​ స్కీ(Zelenskyy) స్పందించారు. ఉక్రెయన్ దళాలు రష్యాలో సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అద్భుతమైన ఆపరేషన్​ను నిర్వహించాయని పేర్కొన్నారు. ఈ దాడి రష్యాకు భారీగా నష్టాన్ని కలిగిందని అన్నారు. అంతేకాకుండా దీనిని సమర్ధమైన దాడిగా పేర్కొన్నారు. ఆదివారం దేశాన్ని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో సైనిక దళాలకు, ఆపరేషన్​లో పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన దళాల అధిపతి నుంచి నివేదిక అందింది. శత్ర భూభాగంలో ఒక అద్భుతమైన ఆపరేషన్ జరిగింది. సైనిక స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని దాడి జరిగింది. ముఖ్యంగా, ఉక్రెయిన్‌ చేసిన దాడుల వల్ల రష్యా గణనీయమైన నష్టాలను చవిచూసింది. ఈ ఆపరేషన్​లో 117 డ్రోనలను ఉపయోగించాం. ఆపరేషన్​ ప్రణాళిక కోసం ఏడాదిన్నర సమయం పట్టింది. ప్లాన్​ చేసిన ప్రకారంగానే రష్యాపై ఉక్రెయిన్ దళాలు పూర్తిగా అమలు చేశాయి. ఇది పూర్తిగా ప్రత్యేకమైన ఆపరేషన్ అని నేను ఖచ్చితంగా చెబుతా. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఆపరేషన్​ గురించి బహిరంగంగా చెప్పడం. మేం ఆపరేషన్​ చేపట్టిన ఆఫీస్, రష్యన్​ భూభాగంలోని ఎఫ్​ఎస్​బీ కార్యలయానికి పక్కనే ఉంది. ఇక ఈ దాడికి సాయం చేసిన వారిని ఆపరేషన్​కు ముందు రష్యా నుంచి తీసుకొచ్చాం. వారు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు. ఏడాదిన్నర శ్రమ ఫలించినందుకు సంతృప్తిగా ఉంది. మేం ఈ దాడులను కొనసాగిస్తాం అని జెలెన్​ స్కీ పేర్కొన్నారు.

Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్​ స్కీ
Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్​ స్కీ

500 డ్రోన్ల దాడికి ఎదురుదెబ్బ
ఈ ఆపరేషన్​ చేపట్టడానికి ముందే రష్యా మరో దాడికి సిద్ధమవుతోందని తమకు నిఘా సమాచారం అందినట్లు జెలెన్​ స్కీ తెలిపారు. రెండు రోజుల్లోనే దాదాపు 500 డ్రోన్లను రష్యా ప్రయోగించిదని అన్నారు. వారు చేసే ప్రతి దాడికి డ్రోన్ల సంఖ్యను పెంచతుందని చెప్పారు. అంతేకాకుండా కాలిబర్ క్షిపణులను కూడా సిద్ధం చేసిందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​ భూభాగాన్ని, ప్రజలను మేం రక్షించుకుంటామని వెల్లడించారు. జెలెన్‌స్కీ ప్రసంగంలో స్పష్టంగా కనిపించింది – ఉక్రెయిన్, రష్యా చేస్తున్న దాడులకు కళ్లెం వేయడమే కాదు, దానికి ప్రతిఘటనగానూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని. శత్రు భూభాగంలో చేసిన ఈ మిషన్, ఉక్రెయిన్ సైనిక సామర్థ్యాన్ని, నిఘా స్థాయిని మరోసారి చూపించింది.

Read Also: Asaduddin Owaisi: మరోసారి పాకిస్థాన్ విధానాలపై ఒవైసీ తీవ్ర విమర్శలు

Shobha Rani

రచయిత గురించి

Shobha Rani

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.