పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ గాయపడిన విషయం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. సింగపూర్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ఆయన గాయపడినట్టు సమాచారం. ఈ ఘటనపై అభిమానులు, నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
జగన్ స్పందన
ఈ విషాద ఘటనపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందన ప్రత్యేక ఆకర్షణగా మారింది. రాజకీయ విభేదాలు పక్కనపెట్టి, మానవీయ కోణంలో స్పందించిన ఆయన మాటలు హృదయాలను తాకాయి. ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) వేదికగా స్పందించిన జగన్, మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సింగపూర్‌లోని ఒక పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదం గురించి తెలిసి నేను షాక్ అయ్యాను. అందులో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడని తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో నా ఆలోచనలు ఆ కుటుంబంతోనే ఉంటాయి. మార్క్ శంకర్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాను – అని జగన్ పేర్కొన్నారు. ఈ ట్వీట్‌కు వైఎస్ అభిమానులే కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా హర్షాతిరేకంగా స్పందిస్తున్నారు. రాజకీయ శత్రువుల మధ్య మానవీయత ఉన్నదని ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. ఇక ఇప్పటికే ఈ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, మాజీ మంత్రి కేటీఆర్, చిరంజీవి తదితరులు స్పందించారు. పవన్ కుమారుడు గాయపడడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని ఆసుపత్రిలో మార్క్ శంకర్‌కు చికిత్స కొనసాగుతున్నట్టు సమాచారం. గాయాలు పెద్దగా ప్రమాదకరంగా లేవని, మానసికంగా మాత్రం చిన్నారి ఉలిక్కిపడినట్టు మెడికల్ బులిటన్ తెలిపింది. పవన్ కళ్యాణ్ కుటుంబం ప్రస్తుతం సింగపూర్‌లోనే ఉన్నట్టు తెలిసింది.
Read also: Kia Motors: కియా కంపెనీలో భారీగా కారు ఇంజన్లు మాయం