ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో మరో అడుగుముందుకేసింది. అయితే ఈ మ్యాచులో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 22 డాట్ బాల్స్ మాత్రమే ఆడింది గుజరాత్. ఈ మ్యాచ్ లో శుభమన్ గిల్ తన సహనాన్ని కోల్పోయాడు. అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. హైదరాబాద్ సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ వివాదాస్పద రీతిలో రనౌట్ అయ్యాడు. గిల్ ఆ మ్యాచ్‌లో 38 బంతుల్లో 76 రన్స్ చేసి ఔటయ్యాడు. అయితే 13వ ఓవర్‌లో జోస్ బట్లర్ బంతిని షార్ట్ ఫైన్ లెగ్ దిశగా ఆడాడు. ఓ సింగిల్ తీశాడు. అయితే ఫీల్డర్ హర్షల్ పటేల్ బంతిని అందుకుని వికెట్ల వైపు విసిరాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి పరుగు కోసం వచ్చిన గిల్ క్రీజ్‌లోకి చేరుకోలేకపోయాడు. థార్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి చాలా సమయం తీసుకున్నాడు. బంతి నేరుగా స్టంప్స్‌కు తగిలిందా లేదా వికెట్ కీపర్ గ్లోవ్స్ ఆ స్టంప్స్‌కు తగిలిందా తేల్చడం ఇబ్బందిగా మారింది. కానీ చివరకు సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలంగా థార్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు.
అఫీషియల్
థార్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం పట్ల గిల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. డగౌట్ వద్ద ఉన్న మ్యాచ్ అఫీషియల్‌తో వాగ్వాదానికి దిగాడు. వాడివేడిగా తన ఔట్ గురించి చర్చించాడు. ఆ వాగ్వాదానికి చెందిన గొడవ కెమెరాలకు చిక్కింది.ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఆరు వికెట్లకు 224 రన్స్ చేసింది. గిల్ 76, సుదర్శన్ 48, బట్లర్ 64 రన్స్ చేశారు. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 186 రన్స్ మాత్రమే చేసింది.
అసహనం
మ్యాచ్ అనంతరం తక్కువ డాట్ బాల్స్ ఆడటం గురించి మాట్లాడాడు కెప్టెన్ శుభ్‌మన్ గిల్. అలానే ఈ మ్యాచులో తాను థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు బడుతూ ఫోర్త్ అంపైర్‌పై అసహనం వ్యక్తం చేసిన సందర్భం గురించి కూడా స్పందించాడు. తాను 110 శాతం ఎఫర్ట్ పెట్టి ఆట ఆడినట్లు చెప్పుకొచ్చాడు. “20 ఓవర్లలో కేవలం 22 డాట్ బంతులను మేము ముందుగా ప్లాన్ చేయలేదు. మేం అనుకున్నదొకటే ఇప్పటివరకు ఆడుతున్న ఆటనే కొనసాగించాలనేదే. ఈ బ్లాక్ సాయిల్ పిచ్ పై సిక్స్‌లు కొట్టడం అంత సులభం కాదు. అయినా నేను, సాయి, జోస్ మేమంతా బాగా పరిస్థితిని అర్థం చేసుకుంటూ ఆడాం. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లాం. క్రీజులో ఒకరిద్దరు కచ్చితంగా ఉండాలి అని మేం అనుకోలేదు. మేమందరం పరుగుల ఆకలితో ఉన్న వాళ్ళం. జట్టు విజయం కోసం ఏది చేయాల్సి వస్తే అది చేయడానికే సిద్ధంగా ఉంటాం. ఫీల్డింగ్ విషయంలో మాత్రం మేం ప్రతి మ్యాచ్‌కు ముందు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పటివరకు అంత గొప్పగా ఫీల్డింగ్ చేయలేకపోయినా, ఈ రోజు మాత్రం మా ఫీల్డింగ్ ప్రదర్శన బాగుంది. ప్రతిఒక్కరూ తమ వంతుగా రాణించారు. ఇటువంటి మైదానాల్లో డిఫెండ్ చేయడానికి ఆప్షన్లు ఉండటం ఉపయోగపడుతుంది. అంపైర్‌తో నాకు కాస్త చర్చ జరిగింది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం 110 శాతం ఇవ్వాలన్న తాపత్రయంలో ఆడుతాం. అ్పపుడు భావోద్వేగాలు ఇలానే ఎక్కువ అవుతాయి. అలాంటి సందర్భాల్లో ఇలాంటివి జరగడం సహజం.” అని గిల్ చెప్పుకొచ్చాడు.
Read Also : IPL 2025 : గుజరాత్ దూకుడు – బ్యాట్‌తో చెలరేగిన గిల్, బట్లర్