ఐపీఎల్ 2025 సీజన్‌లో 30వ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై చెన్నై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. రిషభ్ పంత్ (49 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) ఈ సీజన్‌తో తొలి అర్ధ సెంచరీతో రాణించగా మిచెల్ మార్ష్ (30) ఫర్వాలేదనిపించాడు. చెన్నై బౌలర్లలో జడేజా (2/24), పతిరాన (2/45) తలా రెండు వికెట్లు తీశారు. వికెట్లు పడకపోయినా నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి లక్నోను కట్టడి చేశాడు.స్పిన్నర్లకు సహకరించే ఏకనా పిచ్‌పై లక్నో ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. టాపార్డర్ వైఫల్యంతో ఆ జట్టు ఈ సీజన్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసింది. బంతి దొరికితే స్టాండ్స్‌లోకి పంపిస్తూ పవర్ ప్లేలో వీరవిహారం చేసే బ్యాటింగ్ ద్వయం మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్ (9 బంతుల్లో 8) సైతం చెన్నై బౌలర్ల ధాటికి నిలువలేకపోయారు. మొదటి ఓవర్‌లోనే ఖలీల్ (1/38).. మార్క్మ్‌న్రు ఔట్ చేసి చెన్నైకి తొలి బ్రేక్‌నిచ్చాడు. భీకర ఫామ్‌లో ఉన్న పూరన్‌ను అన్షుల్ 4వ ఓవర్లో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. తొలి 6 ఓవర్లలో లక్నో స్కోరు 42/2 మాత్రమే. పూరన్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ ఓవర్టన్ బౌలింగ్‌లో సిక్సర్‌తో జట్టు స్కోరును 50 పరుగుల మార్కును దాటించాడు.
స్టార్ స్పోర్ట్స్
ఇప్పటి వరకు 31 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. అన్ని జట్లు దాదాపుగా 5 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. దీంతో ప్లే ఆఫ్స్ చేరే జట్లపై అందరి చూపు పడింది. ప్రస్తుతం టాప్ 4లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజరస్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్లు నిలిచాయి.అయితే, ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది అన్ని భాషలలో ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంది.

ఆగ్రహం వ్యక్తం
అయితే, ఈ మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (63) ఫాంలోకి వచ్చాడు. లక్నోను భారీ స్కోర్‌గా తీసుకెళ్లే క్రమంలో భారీ షాట్లు ఆడుతూ పంత్ వికెట్ కోల్పోయాడు. పతిరణా బౌలింగ్‌లో పంత్ భారీ షాట్ ఆడబోయి ధోనికి క్యాచ్ ఇచ్చాడు. ఈ క్రమంలో తెలుగులో కామెంట్రీ చేస్తోన్న వ్యక్తి రిషబ్ పంత్‌ను రిషబ్ పంది అంటూ సంబోధించాడు. దీంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ లాంటి రిచ్ లీగ్‌ను టెలికాస్ట్ చేస్తూ, ఇలాంటి చెత్త మాటలు చెప్పడం ఎంత వరకు సమంజసం అంటూ ఏకిపారేస్తున్నారు.చెన్నై సూపర్ కింగ్స్ఐ దు వికెట్ల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ను ఓడించి విజయాల ట్రాక్‌లోకి తిరిగి వచ్చింది. ఏడు మ్యాచ్‌ల్లో చెన్నైకు ఇది రెండో విజయం. ఇదిలా ఉండగా, ఈ సీజన్‌లో లక్నో మూడో ఓటమిని చవిచూసింది.