‘పుష్ప 2‘ సినిమా భారీ విజయంతో పాటు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను కూడా షేక్ చేసిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను అందుకుంది. ఈ చిత్రంలో శ్రీలీల చేసిన ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాలా పాప్యులర్ అయ్యింది.ఇక, ‘పుష్ప 3’ కూడా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ చిత్రానికి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘పుష్ప 3’లో ఐటెం సాంగ్ కోసం జాన్వీ కపూర్ డ్యాన్స్ చేస్తే అద్భుతంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘కిస్సిక్’ పాటలో ఎవరు నటించినా అంతర్జాతీయ స్థాయిలో పాప్యులర్ అవుతారని మేము ముందే ఊహించాం అని దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు.జాన్వీ కపూర్ గురించి ఆయన మాట్లాడుతూ, ఆమెలో శ్రీదేవి గారిలో ఉన్న గ్రేస్ ఉంది.

అందుకే, ‘పుష్ప 3’లో ఐటెం సాంగ్ కోసం ఆమెను ఎంపిక చేయడం సరికొత్త అవుతుందని, అది అద్భుతంగా ఉంటుందని దేవిశ్రీ అన్నారు. తనకు సాయిపల్లవి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, అలాగే, శ్రీదేవి గారి ఛాయ ఈ అమ్మాయిలో ఉందని ఆయన చెప్పారు.పాటలకు సంబంధించి, హీరోయిన్ ఎంపిక చేసేటప్పుడు పాట మీద ఆధారపడి, డ్యాన్స్ సైల్ కూడా చాలా కీలకమని దేవిశ్రీ ప్రసాద్ చెప్పారు. సమంత, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇలా టాప్ హీరోయిన్లందరూ ఐటెం సాంగ్స్ చేశారని, ముఖ్యంగా పాటతో అద్భుతమైన డ్యాన్స్ చేయాలనే ప్రాధాన్యత ఉండటమే కీలకమని ఆయన వివరించారు.అయితే, దేవిశ్రీ ప్రసాద్ అభిప్రాయం ప్రకారం, ‘పుష్ప 3’లో జాన్వీ కపూర్ ఐటెం సాంగ్‌ను చేయడం మరింత ఆసక్తికరంగా ఉంటుందని, ఈ పాట కూడా ప్రపంచ వ్యాప్తంగా సూపర్ హిట్ అవుతుందని ఆయన విశ్వసిస్తున్నారు.