దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటోన్నారు. ఢిల్లీతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని మిల్కీపూర్, తమిళనాడులోని ఈరోడ్ స్థానాలకూ ఉప ఎన్నిక పోలింగ్ మొదలైంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే పూర్తిచేసింది. 8వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో మొత్తం 699 మంది అభ్యర్థులు నిలిచారు. ముఖ్యమంత్రి ఆతిషి, అల్కా లంబా, పూజా బల్యాన్, రేఖా గుప్తా, పూనం శర్మ.. వంటి వివిధ పార్టీల మహిళ అభ్యర్థులు సహా 96 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.
మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు చాలామంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు. 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ పార్టీని గెలిపిస్తూ వస్తోన్నారు.

మొత్తం 1,55,24,858 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 83,49,645 మంది పురుషులు, 71,73,952 మంది మహిళలు, 1,261 మంది ట్రాన్స్‌జెండర్ ఓటర్లు. వీరందరూ గురువారం కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. సీనియర్ సిటిజన్ల ఓట్లు 24,44,320 ఉండగా.. 80 సంవత్సరాలకు మించి వయస్సు ఉన్న ఓటర్ల సంఖ్య 2,77,221. 80 సంవత్సరాలకు పైనున్న వయస్సు గల ఓటర్లు చాలామంది ఇప్పటికే ఇంటి నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కూడా. మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ వంటి ప్రముఖులూ ఇంటి నుంచే ఓటు వేశారు. 15 సంవత్సరాలుగా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీని ఏలుతోంది. 2014 తరువాత మరో పార్టీకి అవకాశమే ఇవ్వట్లేదు ఢిల్లీ ఓటర్లు. మరి ఈసారి ఎవరిని గెలిపిస్తారో చూడాలి.