బాలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాల మధ్య “రామాయణం” సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాముడిగా కనిపించనున్నారు. ఇక, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఈ మధ్యనే వేగంగా సాగుతుంది, కానీ ఇప్పటి వరకు యష్ రామాయణం సెట్‌లో అడుగుపెట్టలేదు.యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ బస్ డ్రైవర్ కొడుకుగా మొదలు పెట్టిన ఆయన, ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సీరియల్స్ చేసి, తర్వాత కన్నడ సినిమాల్లో హీరోగా వెలుగొందాడు.

అయితే, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన “కేజీఎఫ్” సినిమాతో యష్ కెరీర్ తిరగబెట్టింది.ఆ తర్వాత “కేజీఎఫ్ 2″తో మరింత ఫాలోయింగ్ సంపాదించాడు.ఈ రెండు బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత, యష్ నటించే ప్రతి సినిమా పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం, యష్ “టాక్సిక్” సినిమాలో నటిస్తున్నాడు. అయితే, బాలీవుడ్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “రామాయణం” సినిమాలో ఆయన నటిస్తాడని, ఈ సినిమా షూటింగ్ గురించి సరికొత్త సమాచారం కూడా లభించింది.”రామాయణం”లో యష్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర నెగెటివ్ రోల్ కావడంతో, యష్ అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.
ప్రారంభంలో ఈ విషయం గోప్యంగా ఉండటంతో, అనేక సంచలనాలు తీసుకొచ్చాయి. చివరికి, యష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో రావణుడి పాత్రలో నటించేందుకు ఆసక్తి ఉందని ప్రకటించాడు.ఈ సమయంలో, ఫిలింఫేర్ రిపోర్ట్ ప్రకారం, మార్చి నెలలో యష్ “రామాయణం” సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడని సమాచారం వెలువడింది. దీంతో, అభిమానులు ఆయన రావణుడి పాత్రలో ఎలా కనిపిస్తాడో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మధ్య, “రామాయణం” షూటింగ్ సెట్స్ నుండి కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, చిత్రయూనిట్ మరింత జాగ్రత్తగా ఉంటుంది.ఈ ప్రాజెక్ట్ మొదటి భాగం 2026 దీపావళి సందర్భంగా విడుదల కాబోతుంది.