pushpa 2 dec 5

‘పుష్ప 2’ ట్రైలర్ నిడివి ఎంతో తెలుసా..?

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న “పుష్ప-2” చిత్రం అధికారిక విడుదల తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామని తెలిపారు. మొదట ఈ సినిమా డిసెంబర్ 6న విడుదల చేయాలని భావించినా, ఇప్పుడు ఒక రోజు ముందుగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.

Advertisements

“పుష్ప” ముందు భాగం బ్లాక్బస్టర్ హిట్ కావడంతో, అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ పాత్ర, కథ మరియు మ్యూజిక్ పై అభిమానులలో ఎంతో ఆసక్తి ఉంది. ఈ చిత్రాన్ని ఫస్ట్ పార్ట్ నుంచి ఎక్కువగా ప్రొడక్షన్ విలువలు, సాంకేతికతతో రూపొందిస్తున్నారని అంటున్నారు.

కాగా ఈ మూవీ ట్రైలర్ ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. పట్నాలో సాయంత్రం 5 గంటలకు లాంచ్ ఈవెంట్ ప్రారంభం కానుంది. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 44 సెకన్లు ఉండనున్నట్లు తెలుస్తుంది. కాగా దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాల్లో మూవీ టీమ్ ప్రమోషన్లు చేయనుంది. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ మ్యూజిక్ అందిస్తుండగా..థమన్ BGM అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ లో ఐటెం సాంగ్ లో శ్రీలీలే చిందులేయబోతుంది.

Related Posts
సినీ లవర్స్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
HC

తెలంగాణలో థియేటర్లలో స్పెషల్ షోల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రీమియర్ షోలు, Read more

మెగాస్టార్ చిరంజీవికి అవార్డు హర్షం వ్యక్తం చేసిన ఎంపీ
vaddiraju

తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా గుర్తింపు పొందిన చిరంజీవికి యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక "లైఫ్ టైం అచీవ్‌మెంట్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్" పురస్కారాన్ని Read more

‘రాజా సాబ్’ కొత్తలుక్ లో ప్రభాస్
'రాజా సాబ్' కొత్తలుక్ లో ప్రభాస్

సంక్రాంతి మరియు పొంగల్ సందర్భంగా రాబోయే చిత్రం 'ది రాజా సాబ్' నుండి కొత్త పండుగ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించబడింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ Read more

Mohan Babu : ‘మిస్ యూ నాన్న.. నీ పుట్టినరోజుకి దగ్గర లేను’ మంచు మనోజ్ ఎమోషనల్
mohanbabumanoj

మంచు ఫ్యామిలీ మధ్య గల అంతరంగ విభేదాలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ కుటుంబ కలహాలు చివరికి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లాయి. మంచు విష్ణు, Read more

Advertisements
×