మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31గా ఈ ప్రాజెక్ట్ రాబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాను వచ్చే ఏడాది(2026) సమ్మర్ కానుకగా జూన్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ మూవీ సెట్స్‌లో ఎన్టీఆర్ ఇప్పటికే అడుగుపెట్టాడు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందించనున్నారు.
స్క్రీన్
ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ లో తారాగణంపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అందలేదు. అసలు ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్ల సంగతే తెలియలేదు. కాగా తాజాగా డ్రాగన్ సినిమాలో నటించబోయే హీరోయిన్ల కూడా ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారని టాక్.ఎన్టీఆర్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రుక్మిణి వసంత్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. వీరిద్దరి కెమెస్ట్రీ బిగ్ స్క్రీన్ పై ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.
అధికారిక
ఇక స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఎన్టీఆర్ తో జతకట్టబోతుందని వినిపిస్తుంది. ముఖ్యంగా శృతి హాసన్ ఎన్టీఆర్ తో స్పెషల్ సాంగ్ చేయబోతుందని ఇండస్ట్రీలో టాక్. మరోవైపు ‘ప్రేమలు’ చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో మంచి ఫాలోయింగ్ ను ఏర్పాటు చేసుకున్న యంగ్ బ్యూటీ మమితా బైజూ కూడా ఎన్టీఆర్ సరసన ఓ కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. మరీ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న బిగ్ ప్రాజెక్ట్ కావడంతో ఇలా స్ట్రాంగ్ బజ్ క్రియేట్ అవ్వడం ఆసక్తికరంగా మారింది.ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. నీల్ ప్రాజెక్టుని చేస్తూనే మధ్యలో వార్ 2 సాంగ్ షూట్‌ని ఫినిష్ చేసుకునేలా ఉన్నాడు. ఆ తరువాత నెల్సన్, సితార నాగవంశీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వస్తుంది. ఇవన్నీ పూర్తి అయిన తరువాత మళ్లీ కొరటాల శివతో దేవర 2 స్టార్ట్ చేస్తాడు ఎన్టీఆర్. అసలు ఈ దేవర 2 ఉండదని అంతా అనుకున్నారు. కానీ ఎన్టీఆర్ స్వయంగా దేవర 2 గురించి మాట్లాడాడు. మ్యాడ్ సక్సెస్ మీట్‌కు వచ్చిన ఎన్టీఆర్ ఈ దేవర 2 కచ్చితంగా ఉంటుందని అన్నాడు. కానీ టైం అనేది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్లను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్న తరువాతే దేవర 2 మీదకు వెళ్తాడని టాక్.
Read Also : Pahalgam Attack: పహల్గామ్ దాడిపై స్పందించిన నవాజుద్దీన్ సిద్ధిఖీ