ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకురావడంలో ముందుండే సంస్థ. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేలా మెటా వాట్సాప్ మరో కొత్త అద్భుతమైన ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై మీ స్టేటస్‌కి మీకు నచ్చిన సంగీతాన్ని జోడించుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో ఫొటోలు, వీడియోలు మరింత ఆకర్షణీయంగా మారబోతున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్‌లానే, వాట్సాప్‌లోనూ మ్యూజిక్ ఫీచర్
ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఫొటోలు, వీడియోలకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. వాట్సాప్ ఇప్పుడు అదే తరహా ఫీచర్‌ను తన యూజర్లకు అందిస్తోంది. ఫొటోలు, వీడియోలతో పాటు మ్యూజిక్ జోడించుకోవడానికి ప్రత్యేకమైన మ్యూజిక్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ ఫీచర్‌కు కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. యూజర్లు స్వంతంగా తమకు నచ్చిన పాటలను అప్‌లోడ్ చేయలేరు. అందుబాటులో ఉన్న సెలెక్టెడ్ ట్రాక్స్ నుంచే ఎంచుకోవాలి.
వాట్సాప్ స్టేటస్‌లో మ్యూజిక్ యాడ్ చేయడం ఎలా?
వాట్సాప్ ఓపెన్ చేయాలి, యాడ్ స్టేటస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి, గ్యాలరీ నుంచి ఫొటో/వీడియోని సెలక్ట్ చేసుకోవచ్చు లేదా కొత్తగా తీసుకోవచ్చు.స్టేటస్ ఎడిట్ పేజీలో మ్యూజిక్ ఐకాన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేసి మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చేయాలి, అందుబాటులో ఉన్న పాటల జాబితా నుంచి మీకు నచ్చిన ట్రాక్‌ను ఎంపిక చేసుకోవాలి ,స్టేటస్‌లో పాట ప్లే అవ్వాల్సిన టైమ్‌ను అడ్జస్ట్ చేసుకోవచ్చు ,స్టేటస్ పోస్ట్ చేసిన తర్వాత, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ స్టేటస్‌లో పాటతో కలిపి చూడగలరు. ఫొటో స్టేటస్- 15 సెకన్ల పాట ప్లే అవుతుంది, వీడియో స్టేటస్- 60 సెకన్ల పాట ప్లే అవుతుంది, ట్రాక్ ప్లే అవ్వాల్సిన భాగాన్ని ఎడిట్ చేయొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు మాత్రమే రోలౌట్ అవుతోంది. త్వరలోనే గ్లోబల్‌గా అందరికీ అందుబాటులోకి రానుంది. మీరు మీ ఫోన్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉందా లేదా అనేది వాట్సాప్ లేటెస్ట్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకుని చూడవచ్చు. వాట్సాప్ యూజర్ల కోసం స్టేటస్ మ్యూజిక్ ఫీచర్ మరింత వినోదాన్ని అందించబోతోంది. ఇప్పటివరకు స్టేటస్ ద్వారా ఫొటోలు, వీడియోలు మాత్రమే పంచుకునే అవకాశం ఉండగా, ఇప్పుడు మ్యూజిక్ కూడా జోడించుకోవడం వల్ల యూజర్ ఎక్స్‌పీరియన్స్ కొత్త స్థాయికి చేరనుంది. ఇది ప్రస్తుతం ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.