18 MLAs suspended in Karnataka Assembly

Karnataka : కర్ణాటక అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు

Karnataka : కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ యుటి ఖాదర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్పీకర్ పదవిని అగౌరవపరిచినందుకు క్రమశిక్షణారాహిత్యం కారణంగా మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సిఎన్ అశ్వత్ నారాయణ్ సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలు భైరతి బసవరాజ్, డా. శైలేంద్ర బెల్దాలే, మునిరత్న, ధీరజ్ మునిరత్న, బిపి హరీష్, డా. భరత్ శెట్టి, చంద్రు లమాని, ఉమానాథ్ కోటియన్, రామమూర్తి, దొడ్డనగౌడ పాటిల్, డా. అశ్వత్ నారాయణ్, యశ్‌పాల్ సువర్ణ, బి. సురేష్ గౌడ, శరణు సలగర, చన్నబసప్ప, బసవరాజ మట్టిముడ, ఎస్ఆర్ విశ్వనాథ్‌లను మార్షల్స్ సభ నుండి బయటకు తీసుకెళ్లారు.

కర్ణాటక అసెంబ్లీలో 18మంది ఎమ్మెల్యేలపై

స్పీకర్ కుర్చీ ముందు కాగితాలను చింపి విసిరారు

హనీ-ట్రాప్ కేసుల అంశం, కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై బీజేపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభలో గందరగోళం సృష్టించి, సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగించడమే కాకుండా.. సభలోని వెల్‌లోకి ప్రవేశించి, స్పీకర్ కుర్చీ ముందు కాగితాలను చింపి విసిరారు. దీంతో స్పీకర్ ఈ చర్య తీసుకున్నారు. ఆరు నెలల పాటు సభలో పాల్గొనకుండా అనర్హత వేటు వేస్తూ బిల్లును ఆమోదించారు. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్‌కె పాటిల్ ప్రవేశపెట్టారు. ఇక, సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం.. వేటుకు గురైన సభ్యులు అసెంబ్లీ హాల్‌, లాబీ, గ్యాలరీలోకి ప్రవేశించకూడదు. వారు ఏ స్టాండింగ్ కమిటీ సమావేశాల్లో పాల్గొనకూడదు. అసెంబ్లీ ఎజెండాలో వారి పేర్లతో ఎలాంటి అంశం లిస్ట్ కాకూడదు. ఈ సమయంలో వారికి రోజూవారీ భత్యాలు కూడా అందవు. ఇక సస్పెండైన ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బలవంతంగా బయటకు తరలించారు.

Related Posts
91 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు – కూటమి ప్రభుత్వం
deepam schem

"దీపం-2" పథకం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా పేద కుటుంబాల గృహిణులకు గ్యాస్ కనెక్షన్లను అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా Read more

నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
KTR

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమేనని స్పష్టం భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ Read more

ఆన్‌లైన్ భద్రతకు ప్రమాదం: 78% పాస్‌వర్డ్స్ ఇప్పుడు 1 సెకన్లో క్రాక్ అవుతాయి!
password1

ప్రపంచవ్యాప్తంగా పాస్‌వర్డ్ భద్రతకు సంబంధించిన అనేక సమస్యలు వెలుగు చూసాయి. తాజాగా, నార్డ్‌పాస్ (NordPass) అనే సంస్థ చేసిన ఒక అధ్యయనంలో, ‘123456’ పాస్‌వర్డ్ ఇండియాలో అతి Read more

అమెరిక‌న్ మ‌ద్యంపై భార‌త్ 150 శాతం సుంకం: వైట్‌హౌజ్
India imposes 150 percent tariff on American liquor: White House

న్యూయార్క్ : భారత్‌పై శ్వేత సౌధం కీల‌క ఆరోప‌ణ చేసింది. అమెరికా మ‌ద్యం, వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌పై భార‌త్ అధిక స్థాయిలో సుంకాలు వ‌సూల్ చేస్తున్న‌ట్లు చెప్పింది. అమెరిక‌న్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *