हिन्दी | Epaper
రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌కు కోహ్లీ బీసీసీఐ నేడు కీలక సమావేశం? సచిన్ రికార్డు బీట్ చేసిన విరాట్.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ చేసిన ఆయుశ్ మాత్రే హైదరాబాద్ కు మెస్సీ.. మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం రోహిత్ శర్మ అరుదైన ఘనత రెండోసారి ప్రపంచ ఛాంపియన్‌గా భారత్ నిఖత్ జరీన్ కు స్వర్ణం

IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై రియాన్ పరాగ్ ఏమన్నారంటే?

Anusha
IPL 2025: రాజస్థాన్ రాయల్స్ ఓటమి పై రియాన్ పరాగ్ ఏమన్నారంటే?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో భాగంగా, వరుస విజయాలతో అదరగొడుతున్న ముంబై ఇండియన్స్‌ మరోసారి సత్తాచాటింది. గురువారం జైపూర్‌లోని సవాయ్‌మాన్‌సింగ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ను 117 పరుగుల తేడాతో ఓడించింది. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో మొదట బ్యాట్‌తో ఆ తర్వాత బంతితోనూ రాణించిన ముంబైకి ఈ సీజన్‌లో ఇది వరుసగా ఆరో విజయం. ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన పోరులో రాజస్థాన్‌ సమిష్టిగా విఫలమై ఆడిన 11 మ్యాచ్‌లకు గాను ఎనిమిదింటిలో ఓడి ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది.మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబై.. రికెల్టన్‌ (38 బంతుల్లో 61, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), రోహిత్‌ శర్మ (36 బంతుల్లో 53, 9 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (23 బంతుల్లో 48 నాటౌట్‌, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), హార్దిక్‌ పాండ్యా (23 బంతుల్లో 48 నాటౌట్‌, 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 217/2 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో రాజస్థాన్‌ 16.1 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ముంబై బౌలర్లలో కర్ణ్‌శర్మ(3/23), బౌల్ట్‌(3/28), బుమ్రా (2/15) రాయల్స్‌ను కుప్పకూల్చారు. లీగ్‌లో 8వ ఓటమితో రాజస్థాన్‌ అధికారికంగా ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించగా, ముంబై టాప్‌లోకి దూసుకొచ్చింది.

ఓటమి

ఈ మ్యాచులో 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ తేలిపోయింది. బౌల్ట్‌ (3/28), కర్ణ్‌ శర్మ (3/23), బుమ్రా (2/15) దెబ్బకు 117 పరుగులకే ఓకే అనిపించాడు.ఆర్చర్‌ (30) ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. గత మ్యాచ్‌లో వీర విధ్వంసం సృష్టించిన వైభవ్‌, జైశ్వాల్ ఈ మ్యాచులో చేతులెత్తేశారు. పరాగ్‌ (16), హెట్మేయర్‌ (0), నితీశ్ రానా(9), శుభమ్‌ దూబె (15) అందరూ విఫలమయ్యారు. దీంతో రాజస్థాన్ కు ఓటమి తప్పలేదు.

 IPL 2025: రాజస్థాన్ రాయల్స్  ఓటమి పై రియాన్ పరాగ్ ఏమన్నారంటే?

దృష్టి

మ్యాచ్ అనంతరం ఓటమి గురించి స్పందించాడు రియాన్ పరాగ్. “ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. వాళ్లకు కచ్చితంగా క్రెడిట్ ఇవ్వాల్సిందే. వాళ్ల బ్యాటింగ్ చేసిన విధానం బాగుంది. మ్యాచ్‌ను కాస్త డెప్త్ కు తీసుకెళ్లారు. ఓవర్‌కు 10 పరుగులు స్థిరంగా చేసి, ఆఖర్ లో దూకుడు పెంచారు. మా బ్యాటింగ్ అనుకున్నంత స్థాయిలో లేదు. ఇది మా రోజు కాదు. 190-200 టార్గెట్ అయితే బాగుండేది. కానీ చివర్లో హార్దిక్, సూర్య భాయ్‌ అద్భుతంగా ఆడారు. మేము కొన్ని అంశాల్లో మెరుగవ్వాలి. మేము మంచి ఆరంభాలను ఇస్తున్నాం, కానీ మిడిల్ ఆర్డర్‌ లో సమస్య ఉంది. పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోతే నేను, ధ్రువ్ నిలబడాలి. అయినా మేము మా మీద నమ్మకంతోనే ఉన్నాం. ఇలాంటి పరిస్థితి మళ్లీ వస్తే, ఎలా ఎదుర్కోవాలో సిద్ధంగా ఉన్నాం.”మొత్తంగా ఈ సీజన్ లో మేము చాలా అంశాల్లో బానే రాణించాం. అలానే కొన్ని తప్పులు కూడా చేశాం. మేము బాగా రాణించిన విషయాలపై బాగా దృష్టి పెట్టాలి. చిన్న చిన్న తప్పులు ఎక్కువగా చేశాం. వాటిని పునరావృతం చేయకుండా సరిచేసుకోవాలి. కొన్ని మ్యాచుల్లో చాలా దగ్గరగా వచ్చి ఓడిపోయాం. నెక్ట్స్ జరగబోయే మూడు మ్యాచుల్లో బాగా రాణిస్తామని ఆశిస్తున్నాను.” అని రియాన్ పరాగ్ పేర్కొన్నాడు.

Read Also: IPL 2025: పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870