Mallareddy: హీరోయిన్ ని ఎంతమాట అనేశాడు!

Mallareddy: హీరోయిన్ ని ఎంతమాట అనేశాడు!

తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాజాగా, ‘లైఫ్ (లవ్ యువర్ ఫాదర్ )’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్లారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, తన ప్రత్యేక శైలిలో ప్రసంగించారు.

కసికాపూర్ మంచి కసికసిగా ఉంది

ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ, “ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన అమ్మాయి పేరు కసికాపూర్ అట. మంచి కసికసిగా ఉంది” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలతో అక్కడున్న వారు నవ్వారు, కానీ ఈ వ్యాఖ్యలు రికార్డై, నెట్టింట్లో వైరల్ అయ్యాయి.ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మహిళా నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పని, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడి నోటివెంట రావాల్సిన మాటలివి కావని నెటిజన్లు మండిపడుతున్నారు.

హీరో శ్రీహర్షపై ప్రశంసలు

మల్లారెడ్డి ప్రసంగంలో హీరో శ్రీహర్ష గురించి కూడా మాట్లాడారు. “శ్రీహర్ష మా కాలేజీలోనే చదివాడు. ఇక్కడే హీరోగా మారాడు. ఇక్కడే సినిమా ప్రమోషన్ చేస్తున్నాడు. ఇది చాలా ఆనందంగా ఉందని అన్నారు.అంతేకాదు, “శ్రీహర్ష తమిళ నటుడు విజయ్ కంటే అందంగా ఉన్నాడు” అంటూ ఫన్నీగా వ్యాఖ్యానించి, ప్రేక్షకులను నవ్వించారు.

Capture

శ్రీహర్ష తండ్రి

హీరో శ్రీహర్ష తండ్రి తమ కాలేజీలో ప్రిన్సిపల్‌గా ఉన్నారని చెప్పారు. ఆయన తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా నిర్మించడం గర్వంగా ఉందన్నారు.”ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి చాలా సార్లు నన్ను ఆహ్వానించారు. అందుకే అసెంబ్లీని వదిలేసి ఈ వేడుకకు వచ్చాను. సినిమా బాగా ఆడి, మంచి కలెక్షన్లు రాబట్టాలి” అని ఆకాంక్షించారు.

నెటిజన్ల ఆగ్రహం

అయితే, “కసికసిగా ఉంది” అనే వ్యాఖ్యలపై నెటిజన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.”ఇదేనా ఒక రాజకీయ నాయకుడి బాధ్యత?”బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాయకుడి నోటివెంట రావాల్సిన మాటలివి కావని నెటిజన్లు మండిపడుతున్నారు.అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోసారి వైరల్

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే మల్లారెడ్డికి యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. పూలు అమ్మినా, పాలు అమ్మినా , కష్టపడ్డా అంటూ ఆయన చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ . దీనిపై సోషల్ మీడియాలో ఎన్నో మీమ్స్ వైరల్ అవుతుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మల్లన్నను అంతా ఇష్టపడతారు. అయితే ముక్కుసూటితనంతో మల్లారెడ్డి పలుమార్లు వివాదాల్లో చిక్కుకున్నారు.

Related Posts
తమన్నాకు కోట్లలో ఫాలోవర్లు.. ఫ్యాన్స్‌కు ఎప్పుడూ కనుల విందే
Tamannaah Milky Beauty

తమన్నా భాటియా సినీ ప్రియులకు మిల్కీ బ్యూటీ గా పిలువబడే ఈ అందాల నటి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ప్రత్యేకమైన ఆకర్షణతో పూర్తిగా ఆకట్టుకుంది హ్యాపీడేస్ Read more

Songs: పాటకు భాషేంటి వినగానే కిక్‌ ఇచ్చేటట్టు..
RRR song

సంగీతం ప్రపంచంలో మంచి పాట యొక్క శక్తి కేవలం లిరిక్స్ లేదా మెలోడీ పై ఆధారపడదు. అది శ్రోతలతో ఇన్‌స్టంట్ కనెక్షన్‌ను సృష్టించడం, మొదటి నోట్ నుండి Read more

కాంతార చిత్ర బృందానికి ఊరట
కాంతార చిత్ర బృందానికి ఊరట,

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న రిషబ్ శెట్టి సినిమా ‘కాంతార: చాప్టర్ 1’ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకుంది. హాసన్ జిల్లా సకలేష్‌పూర్ తాలూకాలోని Read more

కమల్ హాసన్ కు ఊహించని షాక్.
కమల్ హాసన్ కు ఊహించని షాక్.

తమిళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన లోకనాయకుడు కమల్ హాసన్, విలక్షణ కథాంశాలతో ప్రేక్షకులను అలరించే దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’ (ఇండియన్) సినిమా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *