Southwest Monsoon: దేశంలో ఈ ఏడాది అనావృష్టి పరిస్థితులకు అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్ లో రుతుపవన ప్రభావంతో కురిసే వర్షాలు ఈసారి తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడవచ్చని కొన్ని వాతావరణ సంస్థలు లెక్కగట్టాయి. వర్షాలు రాకకు కీలకంగా వ్యవహరిస్తున్న నైరుతి రుతుపవనాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి ఎల్ నీనో కారణమ ని ప్రముఖ ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమట్ అంచనా వేసింది. భూమధ్య రేఖ ప్రాంతంలోని పసిఫిక్ మహాసము ద్రంలో ఎల్నినో ఏర్పడే ఛాయలు స్పష్టంగా కనపడుతున్నాయని వెల్లడించింది.
Read Also: Nara Lokesh on Akshaya Patra: అక్షయపాత్ర ఫౌండేషన్ ఘనతపై మంత్రి లోకేశ్ ప్రశంసలు

సరిగ్గా ఇది నైరుతీ రుతుపవనాలు ఊపందుకునే సమయంతో పాటుగా, ఉత్తరార్థ గోళంలో శీతాకా లం గరిష్ఠస్థాయికి చేరుకుంటుంది. ఈ సమయంలో ఎల్న్ని ప్రపంచ వాతావరణంపై ప్రభావం చూపనుంది. దీని ముప్పు ఎక్కువగా దక్షిణాసియా దేశాలపై ఉంటుందని పేర్కొంటోంది. అలాగే ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా, భారత ఉప ఖండంలోని దేశాల్లో వర్షపాతంపై తీవ్ర ప్రభావం పడనుంది అని స్కైమెట్ సంస్థ తొలిసారిగా అంచనా వేసింది. జూలై నెలలో ఎల్నినో ఏర్పడ వచ్చని, దీనితో కరువు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆసియా, పసిఫిక్ క్లైమెట్ సెంటర్ (ఎపిసిసి) కూడా స్పష్టం చేసింది.
ఏపీసీసీ అంచనా ప్రకారం ఉష్ణమండల పసిఫిక్ మహా సముద్రంలో గత నెల నుంచి లానినా బలహీనపడుతూ వస్తోంది. వచ్చే నెలకు పూర్తిగా బలహీనపడి తటస్థ పరిస్థితులు ఏర్పడనున్నాయి. ఏప్రిల్ నెలలో తటస్థ పరిస్థితుల ప్రభావం బలహీనపడి ఎల్నినో మొదలవుతుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించే సమయంలోనే ఈ ఎల్నెనో ప్రభావం తీవ్రంగా ఉండటం గమనార్హం. దక్షిణాసియా దేశాలపై ఈ ముప్పు ఎక్కువగా ఉండనుంది.
భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియా దేశాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉంది. జులై నెలలో ఎల్న్ని పూర్తిస్థాయిలో ఊపందుకుంటుందని, తద్వారా సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తే కరవు పరిస్థితులు ఉత్పన్నమవుతాయని ఆసియా పసిఫిక్ క్లైమెట్ సెంటర్ కూడా హెచ్చరించింది. కాగా గత కొద్దికాలంగా పసిఫిక్ మహాసముద్రంలో వర్షాలకు అనుకూలించే లానినా ప్రభావం క్రమంగా బలహీనపడుతోంది. వచ్చే నెల నాటికి ఇది పూర్తిగా కనుమరుగై తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని, సరిగ్గా ఏప్రిల్ నుంచి ఎల్నినో తన ప్రతాపాన్ని మొదలుపెడుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: