Breaking News : కామారెడ్డి జిల్లాలో భారీవర్షాలు కురవడంతో జాతీయ రహదారి-44పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్డు కోతకు గురికావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (Breaking News) హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు గంటల తరబడి నెమ్మదిగా కదులుతున్నాయి.
సదాశివనగర్ మండలం నుంచి భిక్కనూర్ టోల్‌గేట్ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. బుధవారం, గురువారం కురిసిన వర్షాలకు టెక్రియాల్, సారంపల్లి వద్ద బ్రిడ్జి దెబ్బతింది. మరోచోట రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి.
గురువారం రాత్రి పరిస్థితిని ఎస్పీ రాజేశ్ చంద్ర స్వయంగా పర్యవేక్షించారు. ట్రాఫిక్ సమస్యలతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, రహదారులను వెంటనే మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


Read also :