हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Nadendla Manohar : బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్‌

sumalatha chinthakayala
Nadendla Manohar : బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటాం: నాదెండ్ల మనోహర్‌

Nadendla Manohar : ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ జనసేన ఆధ్వర్యంలో విజయవాడలోని పాత బస్టాండ్ కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో మాజీ మంత్రి సామినేని ఉదయభానుతో కలిసి ఏపీ పౌర సరఫరాలశాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్ముకశ్మీర్‌లో అమాయకులైన 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దుర్మార్గమని అన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిలుపు మేరకు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టామని మనోహర్‌ చెప్పారు. బాధిత కుటుంబ సభ్యులకు తామంతా అండగా ఉంటామన్నారు.

బాధిత కుటుంబ సభ్యులకు అండగా

భారత పౌరులంతా ప్రధాని మోడీకి అండగా నిలవాలి

ఈ సమయంలో భారత పౌరులంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలవాలన్నారు. జనసేన పక్షాన కొవ్వొత్తుల ర్యాలీ, మౌన దీక్షలు, ఇవాళ మానవహారం నిర్వహించామని మనోహర్‌ వెల్లడించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు, కుల, మతాలు చూడవద్దని, భారతీయులుగా మనవాళ్లకు అండగా నిలవాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు జనసేన పక్షాన కూడా సాయం చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఎంతటి బాధ ఉన్నా ఇలాంటి ఘటనలు జరిగిన సమయంలో ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కావలిలో జనసేన నేత మధుసూదన రావు భౌతికకాయాన్ని చూసి పవన్ కల్యాణ్ చలించిపోయారని నాదెండ్ల పేర్కొన్నారు. జరిగిన దుర్ఘటన గురించి ఆయన భార్య చెబుతుంటే కన్నీరు ఆగలేదన్నారు.

Read Also:  ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870