Terror Attack : ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తి

Read Time:  1 min
Visakhapatnam resident Chandramouli funeral complete with government honors
Visakhapatnam resident Chandramouli funeral complete with government honors
FONT SIZE
GET APP

Terror Attack : జమ్మూకశ్మీర్‌‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ హిందూ శ్మశాన వాటికలో చంద్రమౌళి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. చంద్రమౌళి అంత్యక్రియలో మంత్రులు, కూటమి నేతలు, వైసీపీ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రమౌళి అంతిమ సంస్కారాలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వీడ్కోలు పలికారు. చంద్రమౌళి కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వ లాంఛనాలతో విశాఖ వాసి

అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం

ఉగ్రదాడిలో మృతి చెందిన చంద్రమౌళి కుటుంబాన్ని విశాఖ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి గురువారం పరామర్శించారు. పాండురంగాపురంలోని చంద్రమౌళి నివాసానికి వెళ్లిన ఆయన.. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.10లక్షల పరిహారం చెక్కును చంద్రమౌళి కుటుంబసభ్యులకు అందజేశారు. అందమైన కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్రదాడి దేశం మొత్తాన్ని విషాదంలో నింపిందన్నారు. ఈ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసులు సహా 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అన్నారు.

Read Also: ఏపీలో స్పౌజ్ పింఛ‌న్లు… ఈరోజు నుంచి ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.