📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ గంభీర్‌పై స్టేడియంలో నినాదాలు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్

IND vs NZ: శివం దూబే సిక్సర్.. 100 మీటర్ల దూసుకెళ్లిన బంతి

Author Icon By Anusha
Updated: January 24, 2026 • 7:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
IND vs NZ: Shivam Dubey’s six.. the ball traveled 100 meters

న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా (IND vs NZ) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాపార్డర్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోగా.. చివర్ లో, శివం దూబే తన పవర్ హిట్టింగ్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఓపెనర్ ఇషాన్ కిషన్ (76) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. అతడికి తోడుగా మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ (82) మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడటంతో కివీస్ బౌలర్లు చేతులెత్తేశారు.

Read Also: IND vs AUS Test: ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

తనదైన శైలిలో విరుచుకుపడ్డ దూబే

వీరిద్దరి ధాటికి రన్ రేట్ ఆకాశాన్ని తాకింది. మ్యాచ్ ముగింపు దశలో క్రీజులోకి వచ్చిన శివం దూబే (13 బంతుల్లో 36 పరుగులు) తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతడు బాదిన ఒక సిక్సర్ మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. బంతి బ్యాట్‌కు తగిలిన వెంటనే స్టేడియం బయట పడేంత వేగంతో దూసుకెళ్లింది. ట్రాకింగ్ ప్రకారం ఈ సిక్సర్ ఏకంగా 100 మీటర్ల దూరం నమోదైంది.

శివం దూబే కొట్టిన ఈ భారీ షాట్ చూసి డ్రెస్సింగ్ రూంలోని ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులు కూడా నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ సిక్సర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.ఈ విజయంతో భారత్ సిరీస్‌లో బలమైన స్థితికి చేరుకుంది. ఇక అందరి కళ్లు రేపు (ఆదివారం) గౌహతి వేదికగా జరగనున్న మూడో టీ20పైనే ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

IND vs NZ T20 Series India vs New Zealand latest news t20 cricket Team India Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.