Steamed Egg Curry: స్టీమ్డ్ ఎగ్ కర్రీ

Read Time:  1 min
Steamed Egg Curry
Steamed Egg Curry
FONT SIZE
GET APP

కావలసినవి:

  • గుడ్లు – మూడు
  • ఉల్లిపాయ ముక్కలు – పావుకప్పు
  • టొమాటో తరుగు – అరకప్పు
  • పసుపు – పావుచెంచా
  • ఉప్పు – తగినంత
  • మిరియాలపొడి – పావుచెంచా
  • నూనె – పావుకప్పు
  • ఆవాలు – చెంచా
  • మినప్పప్పు – చెంచా
  • కరివేపాకు రెబ్బలు – రెండు

Steamed Egg Curry: మసాలా కోసం:

  • కొబ్బరి తురుము – అరకప్పు
  • జీలకర్ర – అరచెంచా
  • గసగసాలు – అరచెంచా
  • దాల్చినచెక్క – చిన్న ముక్క
  • సోంపు – చెంచా
  • లవంగాలు – మూడు
  • పచ్చిమిర్చి – మూడు
  • దనియాలు – చెంచా
  • వెల్లుల్లి రెబ్బలు – నాలుగు

తయారీ విధానం:

Steamed Egg Curry: ఓ గిన్నెలో గుడ్ల సాన, పావుచెంచా ఉప్పు, మిరియాలపొడి వేసుకుని నురగవచ్చేలా గిలకొట్టుకోవాలి.ఈ మిశ్రమాన్ని ఆవిరిమీద పది నిమిషాలు ఉడికించుకుని ఆ తరువాత ముక్కల్లా కోయాలి.అలాగే మసాలా కోసం పెట్టుకున్న పదార్థాలను మిక్సీలో వేసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి.స్టవ్ మీద కడాయిని పెట్టి, నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేయించుకుని ఉల్లిపాయ ముక్కలు వేయాలి.అవి ఎర్రగా వేగాక టొమాటో(tomato) తరుగు, పసుపు, తగినంత ఉప్పు కలిపి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోయాలి.ఇది ఉడుకుతున్నప్పుడు చేసిపెట్టుకున్న మసాలా వేసి, ఉడికించి ముక్కలుగా కోసిన గుడ్లు(eggs) వేసి, అయిదు నిమిషాలయ్యాక దింపేస్తే సరి.

Read also : hindi.vaartha.com

Read also: Palak Masala Egg: పాలక్ మసాలా గుడ్డు

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.