Palak Masala Egg: పాలక్ మసాలా గుడ్డు

Read Time:  1 min
Palak Masala Egg
Palak Masala Egg
FONT SIZE
GET APP

పాలక్ మసాలా గుడ్డు

కావలసినవి:

  • పాలకూర తరుగు – మూడు పెద్ద కప్పులు
  • పచ్చిమిర్చి – రెండు
  • ఉడికించిన గుడ్లు – ఆరు
  • నూనె – రెండు టేబుల్స్పూన్లు
  • నెయ్యి – రెండు టేబుల్స్పూన్లు
  • బిర్యానీ ఆకు – ఒకటి
  • ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు
  • అల్లం-వెల్లుల్లి తరుగు – టేబుల్స్పూన్లు
  • ఉప్పు – తగినంత
  • కారం – చెంచా
  • పసుపు – అరచెంచా
  • దనియాలపొడి – చెంచా
  • గరంమసాలా – చెంచా
  • జీలకర్ర – చెంచా
  • ఎండుమిర్చి – రెండు

తయారీ విధానం:

Palak Masala Egg: పాలకూర తరుగును అయిదు నిమిషాలు ఉడికించుకుని ఆ తరువాత పచ్చిమిర్చితో కలిపి మెత్తని పేస్టులా చేసుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి.. నూనె వేసి బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లంవెల్లుల్లి తరుగును వేయించుకోవాలి. తరువాత పాలకూర మిశ్రమం, తగినంత ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, దనియాలపొడి వేసి పావుకప్పు నీళ్లు(water) పోయాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడు గుడ్డు(egg) ముక్కల్ని వేసి అయిదు నిమిషాలయ్యాక దింపేయాలి.
మళ్లీ కడాయిని పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, ఎండుమిర్చిని వేయించుకుని కూరలో వేసి కలిపితే చాలు.(Palak Masala Egg)

Palak Masala Egg

Read also:hindi.vaartha.com

Read also: Egg Tadka Masala Recipe: ఎగ్ తడాకా మసాలా

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.