Jonna Laddu-కావలసిన పదార్థాలు
- జొన్నపిండి – ఒక కప్పు
- బెల్లం – అర కప్పు
- పల్లీలు – అర కప్పు
- నెయ్యి – పావు కప్పు
- యాలకుల పొడి – అర టీస్పూన్

తయారు చేసే విధానం:
స్టౌ మీద ప్యాన్ పెట్టి పల్లీలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో పావుకప్పు నెయ్యి (ghee) వేసి, వేడయ్యాక జొన్నపిండి జోడించి పచ్చివాసన పోయేవరకు సన్నని మంటమీద వేయించాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించిన పల్లీలు, జొన్నపిండి, బెల్లం (jaggery) వేసి మెత్తగా మిక్సీ పట్టి ఒక ప్లేట్లో తీసుకోవాలి. పిండి మిశ్రమంలో మిగతా నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలిపి లడ్డూ ఆకారంలో చేసుకుంటే జొన్న లడ్డు రెడీ.

Read also: hindi.vaartha.com
Read also: