Sweet Potato Boorelu:చిలకడదుంప బూరెలు

Read Time:  1 min
Sweet Potato Boorelu:చిలకడదుంప బూరెలు
FONT SIZE
GET APP

Sweet Potato Boorelu:కావలసిన పదార్థాలు:

  • చిలకడ దుంపలు – 1/2 కేజీ
  • ఏలకులు – 10 (పొడి చేసి ఉంచుకోవాలి)
  • మినపప్పు + బియ్యం లేదా మైదాపిండి + బియ్యంపిండి
  • బూరెలు వేయించడానికి సరిపడినంత నూనె
Sweet Potato Boorelu

తయారు చేసే విధానం

చిలకడ దుంపలను మట్టి పోయేలా బాగా కడిగి కుక్కర్‌లో ఉడికించుకోవాలి. తర్వాత వాటికి తొక్కలు తీసి ముద్దగా చేయాలి. బెల్లం కోరుకొని దుంప ముద్దలో కలిపి, అందులో ఏలకుల పొడి వేసి బాణలిలో 3-4 చెంచాల నెయ్యి వేసి బాగా కలిపి ఉండలుగా తయారు చేసుకోవాలి. కావాలంటే బెల్లం(Jaggery) పాకం పట్టించి దుంప ముద్దలో కలిపినా మంచిది. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మినపప్పు మరియు బియ్యాన్ని కలిపి రెండు గంటలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి తోపుపిండిలా తయారుచేసుకోవాలి. బాణలిలోనూనె (oil) వేడి చేసిన తర్వాత, తయ్యారైన ఉండలను తోపుపిండిలో ముంచి వేడినూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ప్లేటులోకి తీసుకోవాలి. ఇవి పూర్ణం బూరెలలాగే రుచిగా, హల్వా లాగా ఉండే స్వీట్లు.

Sweet Potato Boorelu

Read also: hindi.vaartha.com

Read also: Wheat Halwa:కడా ప్రసాదం (గోధుమ హల్వా)

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.