Delicious Curry with Green Gram :పెసలతో రుచికరమైన కూర

Read Time:  1 min
Delicious Curry with Green Gram
Delicious Curry with Green Gram
FONT SIZE
GET APP

Delicious Curry with Green Gram:కావలసిన పదార్థాలు:

  • పెసలు: కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
  • జీలకర్ర: ఒక చెంచా
  • ఉల్లిపాయ: ఒకటి
  • టమాట: ఒకటి
  • టమాట పేస్టు: రెండు టేబుల్స్పూన్లు
  • కొబ్బరిపాలు: ఒకటిన్నర కప్పు
  • మిరియాల పొడి: అర చెంచా
  • గరంమసాలా: చెంచా
  • పసుపు: కొద్దిగా
  • కొత్తమీర: ఒక కట్ట
  • ఉప్పు: తగినంత
  • నూనె: రెండు టేబుల్ స్పూన్లు
  • పచ్చిమిర్చి: రెండు
  • కారం: ఒక స్పూను

తయారు చేసే విధానం:

పెసలను నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. ఆ తరువాత పెసలు, వెల్లుల్లి, జీలకర్ర కుక్కర్లో వేసి, సరిపడా నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి తీసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేసి ఉల్లిపాయ(onion), టమాట ముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేసి బాగా వేయించాలి. తరువాత ఇందులో టమాటపేస్టు, పసుపు, గరంమసాల(Spices), మిరియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. టమాట ముక్కలు మెత్తగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పెసలను వేసి పావుకప్పు నీళ్లు పోయాలి. పప్పు ఉడుకుతున్నప్పుడు కొబ్బరిపాలు, కొత్తమీర తరుగు వేసి స్టౌని సిమ్లో పెట్టి పప్పు బాగా ఉడికాక దింపాలి.

Read also:hindi.vaartha.com

Read also: Pumpkin Dal:గుమ్మడికాయ పప్పు

Hema

రచయిత గురించి

Hema

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.